5

పవన్‌ మూవీలో రానా.. స్పందించిన దగ్గుబాటి హీరో

మలయాళంలో ఘన విజయం సాధించిన అయ్యప్పనుమ్‌ కోషియమ్‌ రీమేక్‌లో పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ నటించనున్న విషయం తెలిసిందే.

పవన్‌ మూవీలో రానా.. స్పందించిన దగ్గుబాటి హీరో
Follow us

| Edited By:

Updated on: Nov 09, 2020 | 2:51 PM

Rana Pawan Kalyan: మలయాళంలో ఘన విజయం సాధించిన అయ్యప్పనుమ్‌ కోషియమ్‌ రీమేక్‌లో పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ నటించనున్న విషయం తెలిసిందే. మలయాళంలో బిజు మీనన్ నటించిన పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇక పృథ్వీరాజ్‌ పాత్రకు గానూ పలువురి పేర్లు వినిపించాయి. అందులో రానా, నితిన్‌, సాయి ధరమ్ తేజ్ ఉన్నారు. వీరిలో ఎవరో ఒకరు ఫైనల్ అవుతారని టాక్ నడిచింది. ( ‘నగ్నత్వం’ నేరమైతే.. నాగ బాబాలను అరెస్ట్ చేయండి: పూజా సంచలన వ్యాఖ్యలు)

ఇదిలా ఉంటే ఈ రీమేక్‌పై రానా స్పందించారు. ఇందులో ఓ పాత్ర కోసం తనను సంప్రదించిన మాట నిజమేనని ఆయన అన్నారు. అయితే ఇంకా ఏదీ ఫైనల్ అవ్వలేదని, ఇందులో నటించాలని తనకు ఆసక్తిగా ఉందని తెలిపారు. మరి ఈ మూవీ కోసం రానా ఫైనల్ అవ్వనున్నారా..? లేదా..? అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా సితారా ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తోన్న ఈ రీమేక్‌కి సాగర్‌ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. థమన్ సంగీతం అందించనున్నారు. (ఏపీ మంత్రులు మేకపాటి, అనిల్‌ కుమార్‌లకు తప్పిన పెను ప్రమాదం)