AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : వెంకటేశ్‏తో సినిమా.. ఆ హీరోయిన్‏తో ఎన్నో కష్టాలు పడ్డా.. చివరకు.. డైరెక్టర్ కామెంట్స్..

దర్శకుడు విజయ్ భాస్కర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నటి కత్రినా కైఫ్‌తో సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. కత్రినా కైఫ్‌ని డైరెక్ట్ చేయడం చాలా కష్టమైన పని అని అన్నారు. అయితే కత్రినా కైఫ్ ఎంతో కష్టపడే స్వభావం ఉన్న హీరోయిన్ అని తెలిపారు. కేవలం రెండు రోజుల ట్రయల్ కోసం వచ్చి, చివరికి మూడు పేజీల క్లైమాక్స్ డైలాగులను కంఠస్థం చేసి నటించిందని ప్రశంసలు కురిపించారు.

Tollywood : వెంకటేశ్‏తో సినిమా.. ఆ హీరోయిన్‏తో ఎన్నో కష్టాలు పడ్డా.. చివరకు.. డైరెక్టర్ కామెంట్స్..
Venkatesh
Rajitha Chanti
|

Updated on: Feb 13, 2026 | 9:35 PM

Share

ప్రముఖ దర్శకుడు విజయ్ భాస్కర్ ఇటీవలి ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్, ముఖ్యంగా నటి కత్రినా కైఫ్‌తో పని చేసిన అనుభవాలు, నటుడు తరుణ్ కెరీర్ మార్గం గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కత్రినా కైఫ్‌ను డైరెక్ట్ చేయడం చాలా సవాలుతో కూడుకున్న పని అని ఆయన అన్నారు. ఆమెకు తెలుగు లేదా హిందీ భాషలపై పట్టు లేకపోవడంతో ప్రారంభంలో కష్టాలను ఎదుర్కొన్నట్లు తెలిపారు. అయినప్పటికీ, కత్రినా కైఫ్ అద్భుతమైన అంకితభావం, కృషి ఉన్న నటి అని ప్రశంసించారు. కత్రినా తన పరిమితులను, తనకు తెలియని విషయాలను అంగీకరించే జ్ఞానం కలిగి ఉందని విజయ్ భాస్కర్ వివరించారు. ఇది ఆమెను మరింత కష్టపడి పనిచేసేలా చేసిందని, భాష తెలియకపోయినా, ఆమె పాత్రకు తగ్గ బాడీ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ప్రయత్నించిందని తెలిపారు. కత్రినాను తన సినిమాలో తీసుకోవాలనే నిర్ణయం తనదేనని, ఈ విషయంలో నిర్మాతలకు కూడా కష్టమైందని చెప్పారు. ఆమెను ఒక ప్రకటనలో చూసి ఆకట్టుకుని, కథ చెప్పిన తర్వాత కూడా ఆమె మొదట వెనకాడిందని, అడ్వాన్సులు కూడా తీసుకోలేదని గుర్తు చేసుకున్నారు.

కత్రినా కైఫ్ భాష తెలియదని భయపడిందని, దీంతో ఆమెను కేవలం రెండు రోజుల పాటు వైజాగ్ లో షూటింగ్ కు ఒప్పించానని దర్శకుడు తెలిపారు. తొలి రోజు డైలాగులు లేకుండా, కేవలం భావాలతో కూడిన సన్నివేశాలతో ఆమెను సులభతరం చేశారు. వెంకటేష్ చెప్తున్న డైలాగ్స్ వింటూ, ఆమె కేవలం తన పుస్తకాన్ని చదువుతూ చిన్నపాటి హావభావాలు చూపించాలని కోరారు. రెండో రోజు ఆమె మరింత సౌకర్యవంతంగా ఫీల్ అయ్యిందని, చివరికి క్లైమాక్స్ లో మూడు పేజీల డైలాగులను కంఠస్థం చేసి అద్భుతంగా నటించిందని విజయ్ భాస్కర్ వివరించారు.

నటుడు తరుణ్ కెరీర్ గురించి మాట్లాడుతూ, ఒకప్పుడు లవ్ స్టోరీ హీరోగా సంచలనం సృష్టించిన తరుణ్, యాక్షన్ సినిమాల వైపు వెళ్లవద్దని తాను సలహా ఇచ్చానని చెప్పారు. అతని అభిమాన గణం రొమాంటిక్ డ్రామా చిత్రాలకే పరిమితమని, తరుణ్ తనదైన ప్రత్యేక గుర్తింపును కొనసాగించాలని అభిప్రాయపడ్డారు. తరుణ్ చాలా తెలివైన యువకుడని, సరైన స్క్రిప్ట్ దొరికితే ఎప్పుడైనా తిరిగి రావచ్చని విజయ్ భాస్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Venkatesh, Katrina Kaif

Venkatesh, Katrina Kaif

ఎక్కువమంది చదివినవి : Folk Song : ఏం పాటరా బాబూ.. కుర్రాళ్లు తెగ పాడుతున్న ఫోక్ సాంగ్.. దెబ్బకు యూట్యూబ్‏లో సంచలనంగా మారింది..