AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prakasam Barrage: రంగంలోకి దిగిన అబ్బులు టీమ్‌.. బోట్ల తొలగింపు ప్రక్రియ ఎంతవరకు వచ్చిందంటే..?

ప్రకాశం బ్యారేజీ వద్ద పడవల తొలగింపు ప్రక్రియ వరుసగా మూడోరోజు ముమ్మరంగా కొనసాగుతోంది. బోట్లను చాలా దృఢంగా నిర్మించడం, మూడు బోట్లు ఒకదానితో ఒకటి చిక్కుకుపోవడం, ఆ మూడింటి బరువు కలిపితే దాదాపు 200 టన్నులు ఉండడం...ఇవన్నీ ఈ ఆపరేషన్‌కు అడుగడుగునా ఇబ్బందులు తీసుకొస్తున్నాయని అర్థమవుతోంది. 

Prakasam Barrage: రంగంలోకి దిగిన అబ్బులు టీమ్‌.. బోట్ల తొలగింపు ప్రక్రియ ఎంతవరకు వచ్చిందంటే..?
Prakasam Barrage Boats
Ram Naramaneni
|

Updated on: Sep 13, 2024 | 6:11 PM

Share

ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర బోట్ల తొలగింపు ప్రక్రియ…అధికారులకు ఛాలెంజ్‌ విసురుతోంది. నాల్గో రోజు గడుస్తున్నా…బోట్ల తొలగింపు పనులు పెద్దగా ముందుకు పడడం లేదు. ప్లాన్‌ A, ప్లాన్‌ B ఫెయిల్‌ అయ్యాయి. ఇప్పుడు ప్లాన్ Cతో ముందుకు వెళుతున్నారు. ఈ బోట్ల తొలగింపు పనులు ఎందుకింత ఆలస్యం అవుతున్నాయి? ఎందుకింత కష్టతరంగా మారాయి.

ఇప్పుడు ప్లాన్‌-C భాగంగా కాకినాడ అబ్బులు అండ్‌ టీమ్‌ రంగంలోకి దిగింది. అబ్బులు చెప్పినదాని ప్రకారం 7 భారీ పడవలను రంగంలోకి దించారు అధికారులు. మునిగిపోయిన బోట్లకు ఐరన్‌ రోప్‌లు, తాళ్లు కట్టి, వాటిని ఈ 7 పడవలకు కట్టి, వాటిని లాక్కుంటూ ఒడ్డుకు చేర్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇవాళ పనుల్లో స్వల్ప పురోగతి కనిపించింది. ఓ బోటును కొద్ది దూరం కదిలించగలిగారు అధికారులు.

ఇక మరోవైపు స్కూబా డైవింగ్‌ టీమ్‌లు.. ఇంజినీరింగ్‌ టీమ్‌లు తమ పని తాము చేస్తున్నాయి. అండర్‌ వాటర్‌ ఆపరేషన్‌లో భాగంగా డైవింగ్‌ టీమ్స్‌ నీళ్లలోకి దిగి గ్యాస్‌ కట్టర్లతో పడవలను కట్‌ చేసి ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. నీటి లోపల 12 అడుగుల లోతుకు వెళ్లిన సిబ్బంది….బోట్లను రెండుగా కట్‌ చేసే పనులు చేస్తున్నాయి. ఇప్పటికే కట్టర్లతో ఓ పడవను కత్తిరించింది అండర్ వాటర్ టీమ్‌. మునిగిన బోట్ల బరువు భారీగా ఉండడంతో వాటిని లిఫ్ట్‌ చేయడం కష్టంగా మారిందంటున్నారు నిపుణులు. బోట్లకు అడ్డుగా భారీ ఇనుప గడ్డర్లు ఉండటంతో ఆపరేషన్‌కి ఆటంకం కలుగుతోందని వర్కర్లు చెప్తున్నారు. దీంతో పనుల్లో పెద్దగా పురోగతి కనిపించడం లేదు.

అంతకుముందు ప్లాన్‌-Aలో భాగంగా 50 టన్నుల బరువు లేపే సామర్థ్యం ఉన్న రెండు భారీ క్రేన్లతో కలిపి లేపినా ఆ బోట్లు కదల్లేదు. దీంతో ప్లాన్‌ A ఫెయిల్‌ అయింది. ఆ తర్వాత ప్లాన్‌Bలో భాగంగా ఎయిర్‌ బెలూన్స్‌ని రంగంలోకి దించారు. అయితే మునిగిన బోట్ల బరువు అత్యంత భారీగా ఉండడం, వాటర్ లెవెల్‌ తగ్గిపోవడంతో ప్లాన్-B కూడా ఫెయిల్‌ అయింది.

అసలు ఈ బోట్ల తొలగింపు ప్రక్రియ అధికారులకు ఎందుకు ఛాలెంజ్‌గా మారిందన్న అంశాలకు వస్తే..  ఒక్కో బోటు 60 నుంచి 65 టన్నుల బరువు ఉంది. మొత్తం 3 బోట్లు ఒకదానికొకటి చిక్కుకున్నాయి.  ఈ బోట్లను చాలా దృఢంగా నిర్మించారు.  ఒక్కో బోటులో మూడు లేయర్లు ఉన్నాయి. ఒక్కో లేయర్‌లో 10 అంగుళాల మందం ఉన్న ఐరన్‌ ప్లేట్‌ ఉంది. కాగా ఈ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి