Nara Lokesh: పెగాసస్‌పై దేనికైనా సిద్ధం.. ఆ విషయాల్లో కూడా విచారణ చేయగలరా..? ఏపీ ప్రభుత్వానికి నారా లోకేష్ సవాల్
AP Pegasus Issue: పెగాసెస్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో దుమారం రేపింది. పెగాసస్ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయించారు. వైసీపీ సభ్యుల వినతితో స్పీకర్
AP Pegasus Issue: పెగాసెస్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో దుమారం రేపింది. పెగాసస్ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయించారు. వైసీపీ సభ్యుల వినతితో స్పీకర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. రెండు మూడు రోజుల్లో శాసనసభ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. పెగాసస్‌పై సభ్యుల్లో ఆందోళన ఉందని ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీనిపై టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ స్పందించారు. పెగాసెస్ పై హౌస్ కమిటీ.. జ్యూడిషియరీ కమిటీ.. లేదా సీబీఐ విచారణ ఇలా దేనికైనా సిద్దమంటూ లోకేష్ పేర్కొ్న్నారు. బాబాయ్ హత్య విషయంలోనూ.. మద్యం మరణాల విషయంలోనూ విచారణ వేయగలరా..? అంటూ ప్రశ్నించారు. మమతా బెనర్జీ అసెంబ్లీలో మాట్లాడారా..? లేదా..? అనే క్లారిటీ ఇప్పటికీ లేదంటూ లోకేష్ పేర్కొన్నారు. బెంగాలీలో మాట్లాడిన వీడియోలో పెగాసెస్ ప్రస్తావన కూడా లేదని బెంగాలీ తెలిసిన తన స్నేహితుడు చెప్పాడంటూ పేర్కొన్నారు.
వ్యక్తిగత విషయాలు వినే అలవాటు తమకెవరికీ లేదన్నారు. ఈ అలవాటు అంబటి రాంబాబుకు ఉందేమోనని.. అందుకే ఆయన రాసలీలలు బయటపడ్డాయంటూ విమర్శించారు. ఐదు రోజులుగా మద్యం.. కల్తీ సారా మరణాలపై పోరాడుతున్నామని.. సారా మరణాలను సహజ మరణాలుగా సీఎం తీసిపారేయడం బాధాకరమంటూ లోకేష్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కల్తీ సారా వల్ల మొత్తంగా 42 మంది చనిపోయారన్నారు. ఏపీ ప్రభుత్వం సరఫరా చేసే మద్యం బ్రాండ్లు అన్ ఫిట్ ఫర్ హ్యూమన్ కన్సప్షన్ అంటూ లోకేష్ మండిపడ్డారు. కల్తీ సారాతో.. కల్తీ మద్యంతో పేదలను ఈ ప్రభుత్వం చంపేస్తోందంటూ విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి కాదు.. జగన్ మోసపు రెడ్డి అని పిలిచేది ఇందుకేనంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల ప్రాణాలకంటే మరేదైనా పెద్ద సమస్య ఉందా..? అంటూ ప్రశ్నించారు.
కాగా.. మమతా బెనర్జీ స్టేట్మెంట్ ఇచ్చారంటూ పెగాసెస్ సాఫ్ట్ వేర్‌పై సభలో చర్చకు పెట్టారని.. మండలి బిజినెస్ లేకుండానే పెగాసెస్ పై చర్చ పెట్టారని లోకేష్ పేర్కొన్నారు. పెగాసెస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేయలేదని మాజీ డీజీపీ సవాంగ్ ఆర్టీఐ దరఖాస్తు దారుకు రిప్లై ఇచ్చారంటూ పేర్కొన్నారు. వ్యక్తులకు.. ప్రైవేట్ సంస్ధలకు పెగాసెస్ సాఫ్ట్ వేర్ అమ్మలేదని ఇజ్రాయిల్ అంబాసిడర్ కూడా ప్రకటన చేశారన్నారు. అయినా నిబంధనలకు విరుద్దంగా సభలో పెగాసెస్ సాఫ్ట్ వేర్ పై స్వల్ప కాలిక చర్చకు మండవి చైర్మన్ అనుమతించారన్నారు.
తాము మద్యం మరణాలపై ప్రతి రోజూ డిమాండ్ చేస్తోంటే చర్చకు ఛైర్మన్ అనుమతించలేదని.. కానీ తప్పుడు సమాచారంతో సభలో చర్చ పెట్టారంటూ విమర్శించారు. ఏమన్నా ప్రశ్నిస్తే 151 మంది ఉన్నారని అంటున్నారని.. భవిష్యత్తులో వైసీపీకి 15 మంది కూడా ఉండని పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. బాబాయ్ హత్య విషయంలోనూ అబద్దాలే చెప్పారని.. డీఎస్పీ ప్రమోషన్ల విషయంవోనూ అబద్దాలే చెప్పారంటూ లోకేష్ ఘాటుగా విమర్శించారు.
Also Read: