Viral: అరె పావురం భలే ఉంది అనుకుంటే.. పప్పులో కాలేసినట్లే…
కైకలూరు స్థానిక ప్రభుత్వ కార్యాలయాల సముదాయం వద్ద చెట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే ఆ చెట్లపై ఎక్కువగా కాకులు వాలుతూ గోల చేస్తుంటాయి. మామూలుగానే ఈరోజు కూడా ఆ చెట్లపై కాకులు వాలాయి. కానీ వాటి మధ్యలో తెల్లగా విచిత్రంగా ఓ పక్షి కాకులతో ఆడుతూ కనిపించింది. ముందుగా దాన్ని అందరూ పావురం అని భ్రమపడ్డారు. కానీ కాసేపటి తర్వాత వారికి అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ తెల్లని పక్షి పావురం కాదు.. అది కూడా కాకే..

కైకలూరు, సెప్టెంబర్ 16: నేలకేసి ఎంత రుద్ధినా ..కాకి కాకే కాని కోకిల కాదంటారు. అవును పుట్టుకతో వచ్చిన రంగు కడతేరే వరకు పోదు. కానీ సృష్టిలో కొన్ని సహజత్వానికి భిన్నంగా జరుగుతాయి. ఇలాంటివి అసలు నమ్మటం సాధ్యం కాదు. అలాంటి వాటికి ఇదుగో ఈపక్షి ఒక ఉదాహారణ చూసేందుకు తెల్లగా ఉంది కదా.. పావురం అయి ఉంటుందంటారా అలా అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. ఎందుకంటారా ఇది పావురం కాదు కాకి. కానీ తెల్లని కాకి. చూడడానికి విచిత్రంగా తెల్లగా ఉంది.. ముందుగా అందరూ దానిని ఒక పావురం అనుకున్నారు. కానీ అది పావురం కాదని దాని స్వరం ద్వారా వారికి తెలిసింది. ఎందుకంటే అది కావ్ కావ్ మని కాకి లాగా అరుస్తుంది. ఇంకేముంది అది నూటికి నూరు శాతం కాకే.. కానీ తెలుపు రంగులో ఉంది కాబట్టి దాన్ని అందరూ తెల్ల రంగు కాకిగా గుర్తించారు. ఈ వింత తెల్ల కాకిని చూసేందుకు స్థానికులు పోటీలు పడ్డారు. ఈ వింత ఘటన ఏలూరు జిల్లా కైకలూరులో స్థానికుల కంటబడింది.
కైకలూరు స్థానిక ప్రభుత్వ కార్యాలయాల సముదాయం వద్ద చెట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే ఆ చెట్లపై ఎక్కువగా కాకులు వాలుతూ గోల చేస్తుంటాయి. మామూలుగానే ఈరోజు కూడా ఆ చెట్లపై కాకులు వాలాయి. కానీ వాటి మధ్యలో తెల్లగా విచిత్రంగా ఓ పక్షి కాకులతో ఆడుతూ కనిపించింది. ముందుగా దాన్ని అందరూ పావురం అని భ్రమపడ్డారు. కానీ కాసేపటి తర్వాత వారికి అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ తెల్లని పక్షి పావురం కాదు.. అది కూడా కాకే.. అది సాధారణ నల్ల కాకికి లాగానే కావ్ కావ్ మని అరుస్తుంది. అయితే ఆ తెల్ల కాకిని చూసేందుకు అక్కడ స్థానికులు క్యూ కట్టారు. ప్రభుత్వ కార్యాలయాలకు ఇతరత్రా పనుల మీద వచ్చిన వారంతా తెల్ల కాకిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ వాతావరణం అంతా సందడిగా మారింది. ఎప్పుడూ తెల్లరంగులో ఉన్నటువంటి కాకిని చూడలేదని, ఇలాంటి తెల్ల రంగు కాకిని చూడడం ఇదే మొదటిసారన్నారు అక్కడి స్థానికులు.
అయితే ఆ తెల్ల కాకి మిగిలిన నల్లకాకులతో కలిసి ఆనందంగా ఆడుతూ, ఆ ప్రాంగణమంతా తిరుగుతూ కావ్ కావ్ మని అరుస్తూ సందడి చేసింది. ఇలా తెల్ల రంగులో కాకులు కనబడటం చాలా అరుదు.. కొన్ని వేల కాకులలో ఒక కాకి మాత్రమే ఇలా తెల్ల రంగులో ఉంటుందని, కాకి చర్మం జుట్టులో మెలనిన్ అనే వర్ణ ద్రవ్యం లోపించడం వల్ల ఇలా తెల్ల రంగులోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా సంభవిస్తాయని, వీటి జీవితకాలం కూడా చాలా తక్కువ అని పశు వైద్యులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




