Andhrapradesh: ఏపీలో భిన్న పరిస్థితులు.. ఓవైపు మండే ఎండలు.. మరోవైపు వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ పక్క ఎండలు మండుతుంటే.. మరోపక్క వర్షాలు.....
ఆంధ్రప్రదేశ్‌లో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ పక్క ఎండలు మండుతుంటే.. మరోపక్క వర్షాలు పడటం కొంత ఉపశమనం కలిగిస్తోంది. అయితే కర్నూలు జిల్లాలో ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో పలుచోట్ల వరి, మమిడి పంటలకు దెబ్బ తగిలింది. కాపుకు వస్తున్న సమయంలో ఈ భారీ వర్షంతో పండ్లు నేలరాలాయి. కర్నూలు జిల్లాలో అకాలవర్షం రైతులకు అపార నష్టం మిగిల్చింది. జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురవడంతో కల్లాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. అరటి, పామాయిల్ చెట్లు కూలిపోయాయి. మామిడి, జీడి మామిడి తోటలకూ అపార నష్టం వాటిల్లింది.
ఈదురుగాలులతో వర్షాలు కురవడంతో వందల ఎకరాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. ఆలూరు నియోజకవర్గ పరిధిలో అక్కడక్కడా కురిసిన అకాల వర్షంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అకాల వర్షానికి హాలహర్వి మండలం నేట్రవట్టి, గూల్యం, బాపురం, తదితర గ్రామాల్లో పూర్తిగా వరిధాన్యం తడిచిపోయింది. చేతికొచ్చిన పంట వర్షార్పణం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
Also Read: ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త..