AP Lockdown: ఏపీలో లాక్ డౌన్ విధించండి.. ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేసిన ఏపీ పీసీసీ చీఫ్ శైల‌జానాథ్

ఏపీలో కరోనా నివారణకు సంపూర్ణ లాక్ డౌన్ విధించాలాని రాష్ట్ర ప్రభుత్వాన్ని పీసీపీ చీఫ్ శైలజనాథ్ డిమాండ్ చేశారు. కరోనాను అరికట్టేందుకు....

AP Lockdown: ఏపీలో లాక్ డౌన్ విధించండి.. ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేసిన ఏపీ పీసీసీ చీఫ్ శైల‌జానాథ్
Sailajanath
Follow us
Ram Naramaneni

|

Updated on: May 05, 2021 | 8:55 AM

ఏపీలో కరోనా నివారణకు సంపూర్ణ లాక్ డౌన్ విధించాలాని రాష్ట్ర ప్రభుత్వాన్ని పీసీపీ చీఫ్ శైలజనాథ్ డిమాండ్ చేశారు. కరోనాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని , తాత్కాలికంగా కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొత్తం వైద్య రంగాన్ని ఆసుపత్రులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అందరికీ వైద్యం అందించాలన్నారు. ఆక్సిజన్ కొరతతో ప్రజల ప్రాణాలు పొతుంంటే ప్రభుత్వం ఏం చేస్తుందని శైలజానాథ్‌ ప్రశ్నించారు. లాక్ డౌన్ విధించి ప్రతి ఇంటికి 7వేల నగదును నిత్యావసరాల సరుకులు ఇవ్వాలన్నారు. రెమిడెసివర్ ను 30 వేల రూపాయలకు బ్లాక్ మార్కెట్ లో అమ్ముతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.

దేశంలో, రాష్ట్రంలో కరోనా తీవ్రతకు బీజేపీ, వైసీపీ ప్రభుత్వాలే కారణమని శైలజానాథ్‌ ఆరోపించారు. ఆరెస్సెస్‌ విధానాలను బీజేపీ అనుసరించడం వల్లే కరోనా విస్తరిస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలనే జగన్ అనుసరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించాలని శైలజానాథ్‌ డిమాండ్‌ చేశారు.

Also Read: కర్ఫ్యూ సమయంలో శ్రీవారి దర్శనం ఉంటుందా.? క్లారిటీ ఇచ్చిన టీటీడీ