Bharat Jodo Yatra: ఏపీలో మూడో రోజు భారత్ జోడో యాత్ర.. మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకోనున్న రాహుల్..
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో మూడో రోజు ప్రారంభమైంది. గురువారం ఉదయం కర్నూలు జిల్లాలోని బనవాసి నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర మొదలుపెట్టారు.

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో మూడో రోజు ప్రారంభమైంది. గురువారం ఉదయం కర్నూలు జిల్లాలోని బనవాసి నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర మొదలుపెట్టారు. పాదయాత్ర కల్లుదేవరకుంట వరకు కొనసాగనుంది. బోడిబండ నుంచి ఎమ్మిగనూరు, ధర్మాపురం టోల్ గేట్ మీదుగా కలుదేవకుంట వరకు 22కిలోమీటర్ల మేర భారత్ జోడో యాత్ర కొనసాగానుంది. ముగటి, హలహర్వి మీదుగా చేరుకోనుంది. సాయంత్రం రాహుల్ మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠాన్ని సందర్శించి.. మఠాధిపతి శ్రీసుబుదేంద్రతీర్థ స్వామిజీని కలిసి సంభాషించనున్నారు. సాయంత్రం చెట్నిహల్లిలో పాదయాత్ర నైట్ హాల్ట్ ఉంటుందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. హాలహర్వి, కల్లుదేవరకుంటలో రాహుల్ ప్రసంగించనున్నారు. ఈ యాత్ర కోసం ఏపీ కాంగ్రెస్ అన్ని ఏర్పాట్లు చేసింది.
ఏపీలో రేపటి వరకు రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 96 కిలో మీటర్లకు పైగా పాదయాత్ర సాగనుంది. ఏపీకి చెందిన కీలక నాయకులతోపాటు.. తెలంగాణ నేతలు కూడా ఈ యాత్రలో పాల్గొంటున్నారు. ఏపీ నుంచి కర్ణాటకకు, ఆ తర్వాత 23న తెలంగాణకు భారత్ జోడో యాత్ర చేరుకోనుంది.



రాహుల్ భారత్ జోడో యాత్రలో కాన్వాయ్‌లో కొట్లాట..
రాహుల్ భారత్ జోడో యాత్రలో ఉద్రిక్తత చెలరేగింది. పాదయాత్రలో స్వల్ప టెన్షన్ రేపింది. CRPF వాహన డ్రైవర్, పాదయాత్ర టీమ్ మెంబర్స్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. CRPF కానిస్టేబుల్ ఎంట్రీ ఇవ్వడంతో గొడవ పెద్దగా మారింది. టీమ్ మెంబర్స్.. CRPF సిబ్బంది మధ్య మాటామాటా పెరిగింది. ఒకదశలో ఒకరినొకరు నెట్టేసుకొనే దాకా వెళ్లింది. అక్కడే ఉన్న పలువురు సర్దిచెప్పడంతో పంచాయితీ సద్దుమణిగింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..
