AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pulasa: గోదావరిలో చిక్కిన తొలి పులస – రేటు ఎంత పలికిందో తెల్సా..?

పుస్తెలు అమ్మైన పులస కూర తినాలని సామెత చాలా మందికి తెలిసే ఉంటుంది. పులసకు అంత డిమాండ్ ఉంటుంది మరి. ఎంతో రుచికరంగా ఉండే పులస కేవలం వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది. వలలో ఒక్క పులస చేప చిక్కినా ఆ జాలరి సంబంరం అంతా ఇంతా కాదు.

Pulasa: గోదావరిలో చిక్కిన తొలి పులస - రేటు ఎంత పలికిందో తెల్సా..?
Pulasa Fish
Ram Naramaneni
|

Updated on: Jul 06, 2025 | 5:48 PM

Share

గోదావరిలో ఫస్ట్ పులస చిక్కిందండోయ్. అవును… యానాం ఫిష్ మార్కెట్‌లో తొలిసారి పులస చేప కనిపించింది. అయితే వేలం పాటలో కేవలం రూ.4,000 ధర పలికింది. మాములుగా అయితే ఇదే సైజ్ పులస చేప 15 వేల నుంచి 25 వేల వరకు పలికేది. కానీ గోదావరిలో నీటి ప్రవాహం పూర్తిగా మారకపోవడంతో డిమాండ్ తగ్గి.. తక్కువ ధరకు పరిమితమైంది.

బంగాళాఖాతంలోంచి గోదావరిలోకి ఎదురీదుతూ వచ్చే పులస చేపకు తెలుగు రాష్ట్రాల్లో యమ గిరాకీ ఉంటుంది. ఒక్క చేప అయినా వలలో పడితే ఆ జాలరికి పండుగే. వేల రూపాయల ధర పలికే ఈ చేపకు ఇంత భారీ ధర పలకడానికి కారణం దాని టేస్టే. గోదావరికి ఎదురు ఈదుతూ వచ్చే ఈ చేపను జీవితంలో ఒక్కసారైనా తినాలని అనుకోని వారుండరు. పుస్తెలమ్మి అయినా పులస పులుసు తినాలనేది సామెత. పులస వేట సీజన్ ప్రారంభమైనప్పటికీ గోదావరి జలాల్లో స్వల్ప ఉప్పుతనం మాత్రమే ఉంది. వర్షాలు పెద్దగా పడకపోవడం వల్ల సముద్రపు నీరు లోపలికి అంతగా చేరలేదు. దీంతో చిక్కిన పులసకు ఎక్కవ ధర పలకలేదు.

వాస్తవానికి దీన్ని ఇలస అంటారు. గోదావరిలో ఎదురీదిన తర్వాత మార్పులు చెంది.. పులసగా రూపాంతరం చెందుతుంది. పులసల సీజన్‌లో డిమాండ్‌‌ను క్యాష్ చేసుకోవడానికి కొందరు ఇలసలను పులసలుగా చెప్పి అమ్ముతుంటారు. గోదావరి జనం చేపను చూడగానే అది పులస లేక ఇలస అని ఈజీగా చెప్పేస్తారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దారిద్ర్యం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
దారిద్ర్యం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
చలితో బరువుతగ్గొచ్చట.. బ్రౌన్ ఫ్యాట్ సీక్రెట్ చెప్పిన సైంటిస్టులు
చలితో బరువుతగ్గొచ్చట.. బ్రౌన్ ఫ్యాట్ సీక్రెట్ చెప్పిన సైంటిస్టులు