Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakhapatnam: గత్తరలేపుతున్న గలీజ్‌ దందా.. టాస్క్‌పోర్స్ తనిఖీల్లో బయటపడ్డ అసలు యవ్వారం..!

విశాఖలో మరోసారి గలీజ్ దందా వెలుగుచూసింది. స్పా పేరుతో అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్న సెంటర్‌ను సీజ్‌ చేశారు పోలీసులు. నిర్వాహకులతో పాటు విటులను స్టేషన్‌కు తరలించారు. స్మార్ట్ సిటీ విశాఖపట్నంలో స్పా సెంటర్లలో అనైతిక కార్యకలాపాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. లగ్జరీ వాతావరణం, శారీరక-మానసిక ప్రశాంతత ఇస్తామంటూ మసాజ్ సెంటర్లు వ్యభిచార దందాను యధేచ్చగా సాగిస్తున్నాయి.

Visakhapatnam: గత్తరలేపుతున్న గలీజ్‌ దందా.. టాస్క్‌పోర్స్ తనిఖీల్లో బయటపడ్డ అసలు యవ్వారం..!
Prostitution Racket Busted
Balaraju Goud
|

Updated on: Nov 06, 2025 | 7:19 AM

Share

విశాఖలో మరోసారి గలీజ్ దందా వెలుగుచూసింది. స్పా పేరుతో అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్న సెంటర్‌ను సీజ్‌ చేశారు పోలీసులు. నిర్వాహకులతో పాటు విటులను స్టేషన్‌కు తరలించారు. స్మార్ట్ సిటీ విశాఖపట్నంలో స్పా సెంటర్లలో అనైతిక కార్యకలాపాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. లగ్జరీ వాతావరణం, శారీరక-మానసిక ప్రశాంతత ఇస్తామంటూ మసాజ్ సెంటర్లు వ్యభిచార దందాను యధేచ్చగా సాగిస్తున్నాయి. టాస్క్‌పోర్స్ పోలీసుల సోదాల్లో ఈ యవ్వారం బయటపడింది.

సిరిపురం, ద్వారకానగర్, రామ్‌నగర్, సీతమ్మపేట వంటి ప్రాంతాల్లో స్పాలు వ్యభిచారానికి కేరాఫ్‌గా మారాయి. లేటెస్ట్‌గా రామాటాకీస్‌లోని ఆర్కిడ్ వెల్ నెస్ స్పా సెంటర్‌పై దాడులు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు పది మంది యువతులను రెస్క్యూ చేశారు. ముగ్గురు విటులతో పాటు ఇద్దరు నిర్వాహకులను అరెస్ట్ చేశారు.నిబంధనలకు విరుద్ధంగా స్పాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

అందమైన యువతులతో పాటు ఆధునిక సౌకర్యాలతో గదులను అలంకరించి రిలాక్సేషన్ పేరుతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి నగరంలోని స్పా సెంటర్లు. నగరంలో గతంలో కూడా అనేక స్పాలపై దాడులు చేసి నిర్వాహకులను అరెస్ట్‌ చేశారు. అయినా కూడా ఈ గలీజ్‌ దందాకు అడ్డుకట్టపడ్డం లేదు. ఈ స్పా సెంటర్లు కేవలం విశాఖకే పరిమితం కాదు.. హైదరాబాద్, గుంటూరు వంటి నగరాల్లో కూడా స్పా సెంటర్ల పేరుతో వ్యభిచారం దందా సాగుతోంది. థాయ్ స్పాల పేరుతో నడిచే కొన్ని సెంటర్లు, విదేశీ యువతులను పర్యాటక వీసాలపై తీసుకొచ్చి ఈ దందాలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా యువతులు నార్త్ ఇండియా, థాయ్‌లాండ్, ఇతర దేశాల నుంచి తీసుకొస్తున్నారు.

ఉద్యోగాల పేరుతో యువతులను తీసుకొచ్చి, తర్వాత బలవంతంగా వ్యభిచారం కూపంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్, సోషల్ మీడియా, ఫోన్ కాల్స్ ద్వారా ప్రచారం చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. మూసివేసిన గదుల్లో క్రాస్ జెండర్ మసాజ్‌లు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. వీటిని అరికట్టాలంటే కఠిన నిబంధనలు తేవాలంటున్నాయి సామాజిక వేదికలు. స్పా సెంటర్ల నిర్వహణకు స్పష్టమైన నిబంధనలు, లైసెన్సింగ్ విధానాలు రూపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..