AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adhra: ఏపీ వ్యాప్తంగా సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్‌లు కిటకిట.. ఒక్క రోజులో 100 కోట్లుగా పైగా రెవిన్యూ

- ఏపీలోని సబ్‌ రిజిస్ట్రార్ ఆఫీసులు కళకళలాడుతున్నాయ్. శనివారం నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు అమల్లోకి రానుండటంతో... ఎక్కడా చూడు ఫుల్‌ రష్‌ కనిపిస్తోంది. మరి ఆ రేంజ్‌ తాకిడికి ఇన్‌కమ్‌ ఎలా ఉండాలి...? యస్‌.. ఓవర్‌ నైట్‌లో రెవెన్యూ వందకోట్లు దాటేసింది. ఆ డీటెయిల్స్‌ తెలుసుకుందాం పదండి...

Adhra: ఏపీ వ్యాప్తంగా సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్‌లు కిటకిట.. ఒక్క రోజులో 100 కోట్లుగా పైగా రెవిన్యూ
Land Registration
Ram Naramaneni
|

Updated on: Jan 31, 2025 | 6:04 PM

Share

ఏపీ వ్యాప్తంగా సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్‌లు కిటకిటలాడుతున్నాయి.  గురువారం నుంచి ఆఫీసుల్లో రష్ కొనసాగుతుంది.  గురువారం ఒక్కరోజే రాష్ట్రంలో 14250 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఒక్కరోజులో ప్రభుత్వానికి 107కోట్ల ఆదాయం వచ్చింది.  గురువారం అత్యధికంగా గుంటూరు జిల్లాలో 1184 రిజిస్ట్రేషన్లు జరిగాయి.  ఎన్టీఆర్‌ జిల్లాలో 946, పల్నాడులో 944, విశాఖలో 658 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. అయితే అల్లూరి అల్లూరి జిల్లాలో మాత్రం ఎలాంటి రిజిస్ట్రేషన్లు అవ్వాయి.

ఇక శనివారం నుంచే ఏపీలో కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. అలాగే భూముల మార్కెట్ ధరలు కూడా పెంచుతున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే నిత్యం 70 నుంచి 80 రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లోనూ.. గత మూడ్రోజుల నుంచి 150 నుంచి 170 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ రేంజ్‌ తాకిడికి పలు చోట్ల సర్వర్లూ మొరాయిస్తున్నాయి. ఇటు గుంటూరు జిల్లా రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో రాష్ట్రంలో ఎక్కడాలేని రద్దీ కనిపిస్తోంది.

గ్రోత్ కారిడార్లలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నారు. ఛార్జీల పెంపు సాధారణంగా 15 నుంచి 20 శాతం మధ్య ఉంటుంది. రెవెన్యూ ఆదాయం పెంపు రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడుతుంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలను క్రమబద్ధీకరిస్తున్నారు.. కొన్ని చోట్ల ధరలు తగ్గితే.. మరికొన్ని చోట్ల పెరగనున్నాయి. గతంలో రిజిస్ట్రేషన్ విలువల పెంపు శాస్త్రీయ పద్ధతిలో చేయలేదని, దీని కారణంగా చాలా చోట్ల భూమి విలువ కంటే రిజిస్ట్రేషన్ విలువ అధికంగా ఉన్నట్లు గుర్తించారు. రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ