Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Camp Politics: అటు గుంటూరు.. ఇటు హిందూపురం.. కాకరేపుతోన్న క్యాంపు రాజకీయం!

రాజకీయాలందు ఏపీ రాజకీయాలు వేరయా...! అని మరోసారి రుజువైంది. ఎన్నిక చిన్నదైనా.. రాజకీయం మాత్రం తగ్గేదేలే అన్నట్లుంది. అటు గుంటూరులో మునిసిపల్ కార్పొరేషన్ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలు.. ఇటు హిందూపురంలో మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక కాక పుట్టిస్తోంది. మరి ఎవరి క్యాంపు పాలిటిక్స్‌ ఫలితాన్నిస్తాయన్నది తెలియాలంటే ఫిబ్రవరి 3వరకు ఆగాల్సిందే..!

AP Camp Politics: అటు గుంటూరు.. ఇటు హిందూపురం.. కాకరేపుతోన్న క్యాంపు రాజకీయం!
TDP-YCP
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 31, 2025 | 9:44 PM

ఆంధ్రప్రదేశ్‌లో క్యాంపు పాలిటిక్స్‌ కాకరేపుతున్నాయి. పోటాపోటీ వ్యూహాలతో అటు తెలుగు దేశం.. ఇటు వైస్సార్ కాంగ్రెస్ పార్టీలు రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. గుంటూరులో క్యాంపు రాజకీయం ఓరేంజ్‌లో ఘాటెక్కిస్తుంటే.. హిందూపురంలోనూ అదే తంతు జోరుగా నడుస్తోంది..! అసలేంటి క్యాంపు కథ..? తెలుసుకుందాం..!

రాజకీయాలందు ఏపీ రాజకీయాలు వేరయా…! అని మరోసారి రుజువైంది. ఎన్నిక చిన్నదైనా.. రాజకీయం మాత్రం తగ్గేదేలే అన్నట్లుంది. అటు గుంటూరులో మునిసిపల్ కార్పొరేషన్ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలు.. ఇటు హిందూపురంలో మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక కాక పుట్టిస్తోంది. అసలేం జరుగుతోంది..? ఏం జరగబోతోందన్న ఉత్కంఠ పెంచుతున్నాయి.

గుంటూరులో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఆసక్తిరేపుతున్నాయి. ఇప్పటికే స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా, బరిలో 12 మంది నిలిచారు. వైసీపీ, టీడీపీల నుంచి చెరో ఆరుగురు పోటీలో ఉన్నారు. ఫిబ్రవరి 3న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నిక రోజు 50 శాతం ఓట్లు వచ్చిన వారిని గెలిచినట్టు ప్రకటిస్తారు. అదంతా ఓకే.. కానీ ఇప్పుడు ఎన్నికను రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే రాజకీయ రచ్చకు కారణమవుతోంది. ఎన్నికల నాటికి కార్పొరేటర్లు చేజారకుండా ఉండేలా అటు వైసీపీ, ఇటు టీడీపీ క్యాంపు రాజకీయాలు చేస్తుండంటం కాకరేపుతున్నాయి.

2021లో గుంటూరు కార్పొరేషన్‌ ఎన్నికలు జరగ్గా, 57 డివిజన్లలో 47 వైసీపీనే గెలిచింది. టీడీపీ 8, జనసేన 2 చోట్ల గెలిచాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత 14 మంది కార్పొరేటర్లు ఎన్డీయే కూటమి పార్టీలలో చేరిపోయారు. దీంతో.. కూటమి బలం 24కి పెరిగింది. ప్రస్తుతం వైసీపీ శిబిరంలో ఉన్న 30 మందిలో మరికొందరు చేజారిపోతారనే అనుమానంతో క్యాంప్ రాజకీయాలకు తెరతీసింది వైసీపీ. అటు కూటమి సైతం తమ దగ్గర ఉన్న కార్పొరేటర్లు పక్కచూపులు చూడకుండా క్యాంపునకు తరలించింది.

ఇటు సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీలోనూ క్యాంప్‌ రాజకీయం కాక పుట్టిస్తోంది. వైసీపీ నుంచి గెలిచి చైర్‌పర్సన్‌ ఇంద్రజ.. ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరడంతో చైర్మన్‌ పీఠం ఖాళీ అయింది. ఫిబ్రవరి 3న మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుండడంతో టీడీపీ అలెర్ట్‌ అయింది. 20మంది కౌన్సిలర్లను బెంగళూరు క్యాంపునకు తరలించడంతో హిందూపురం రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

ఇక, గత మున్సిపల్‌ ఎన్నికల్లో హిందూపురం మున్సిపాలిటీలోని 38 వార్డుల్లో వైసీపీ 30 గెలుచుకోగా.. టీడీపీ ఆరు స్థానాలకే పరిమితం అయింది. బీజేపీ, ఎంఐఎం చెరో ఒక్కో వార్డు గెలుచుకున్నాయి. అయితే.. కూటమి అధికారంలోకి వచ్చాక 14మంది వైసీపీ కౌన్సిలర్లు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ క్రమంలోనే.. ఫిబ్రవరి 3న హిందూపురం మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక జరుగుతుండడంతో కౌన్సిలర్లు చేజారకుండా టీడీపీ క్యాంపు రాజకీయాలు చేపట్టింది. ఇక ఫిబ్రవరి 3వ తేదీన బెంగళూరు క్యాంపు నుంచి కౌన్సిలర్లు నేరుగా హిందూపురం మున్సిపల్ కార్యాలయానికి చేరుకునేలా టీడీపీ ఏర్పాట్లు చేస్తోంది.

మొత్తంగా…అటు గుంటూరు, ఇటు హిందూపురంలో క్యాంపు రాజకీయం ఆసక్తికరంగా మారింది. మరి ఎవరి క్యాంపు పాలిటిక్స్‌ ఫలితాన్నిస్తాయన్నది తెలియాలంటే ఫిబ్రవరి 3వరకు ఆగాల్సిందే…!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

పింక్ కలర్ డ్రస్‌లో బార్బీ డాల్‌లా మెరిసిపోతున్న సుప్రీత..
పింక్ కలర్ డ్రస్‌లో బార్బీ డాల్‌లా మెరిసిపోతున్న సుప్రీత..
కొంటె చూపులు.. కవ్వించే నవ్వు..
కొంటె చూపులు.. కవ్వించే నవ్వు..
ఇంటర్‌ విద్యార్థులకు బిగ్‌బ్రేకింగ్‌ న్యూస్‌..!ఇవీ పరీక్షా రూల్స్
ఇంటర్‌ విద్యార్థులకు బిగ్‌బ్రేకింగ్‌ న్యూస్‌..!ఇవీ పరీక్షా రూల్స్
షమీ స్థానంలో డేంజరస్ పేసర్ ఎంట్రీ.. ప్లేయింగ్ 11లో కీలకమార్పు?
షమీ స్థానంలో డేంజరస్ పేసర్ ఎంట్రీ.. ప్లేయింగ్ 11లో కీలకమార్పు?
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెండ్..
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెండ్..
అందమైన ముఖం కోసం చక్కనైన చిట్కా..ఈ ఎసెన్షియల్ ఆయిల్ తో
అందమైన ముఖం కోసం చక్కనైన చిట్కా..ఈ ఎసెన్షియల్ ఆయిల్ తో
సౌతాఫ్రికా, ఇంగ్లండ్ మ్యాచ్‌ రద్దయితే, భారత్‌ను ఢీ కొట్టేది ఎవరు?
సౌతాఫ్రికా, ఇంగ్లండ్ మ్యాచ్‌ రద్దయితే, భారత్‌ను ఢీ కొట్టేది ఎవరు?
పెను సమస్యగా ఊబకాయం.. పిల్లలు లావుగా మారడానికి కారణం అదేనట..
పెను సమస్యగా ఊబకాయం.. పిల్లలు లావుగా మారడానికి కారణం అదేనట..
ఆటలోనే కాదు.. అందంలోనూ అదరహో.. ఈ బ్లాక్ శారీ క్వీన్ ఎవరో తెలుసా?
ఆటలోనే కాదు.. అందంలోనూ అదరహో.. ఈ బ్లాక్ శారీ క్వీన్ ఎవరో తెలుసా?
రీ ఎంట్రీకి రెడీ అయిన క్రేజీ బ్యూటీ రంభ..
రీ ఎంట్రీకి రెడీ అయిన క్రేజీ బ్యూటీ రంభ..