Prakasam: 14 ఏళ్ల క్రితం కాంగ్రెస్ నేత దారుణ హత్య.. నేడు కోర్టు సంచలన తీర్పు
అది 2009 సంవత్సరం ఏప్రిల్ నెల 23వ తేదీన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సంధర్బంగా అద్దంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని పేరాయపాలెం గ్రామంలో పోలింగ్ జరుగుతోంది. గ్రామంలోని పోలింగ్ బూత్ దగ్గర ఓటు వేసే విషయంలో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన చెన్నుపాటి రమేష్‌ను టిడిపికి చెందిన కార్యకర్తలు జాగర్లమూడి సత్యనారాయణ మరికొంతమంది..
ఒంగోలు, ఆగస్టు 25: దాదాపు పద్నాలుగేళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికల సమయంలో రెండు రాజకీయ పార్టీల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణల్లో కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసుకు సంబంధించి తాజాగా కోర్టు తీర్పు వెలువరించింది. హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు, ఆరుగురికి మూడేళ్ళ జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అసలేంటీ కేసు.. ఎక్కడ జరిగింది? ఏం జరిగింది వంటి వివరాలు మీ కోసం..
అది 2009 సంవత్సరం ఏప్రిల్ నెల 23వ తేదీన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సంధర్బంగా అద్దంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని పేరాయపాలెం గ్రామంలో పోలింగ్ జరుగుతోంది. గ్రామంలోని పోలింగ్ బూత్ దగ్గర ఓటు వేసే విషయంలో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన చెన్నుపాటి రమేష్‌ను టిడిపికి చెందిన కార్యకర్తలు జాగర్లమూడి సత్యనారాయణ మరికొంతమంది కలిసి దారుణంగా హత్య చేశారు.
2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశంజిల్లా అద్దంకి మండలం పేరాయపాలెంలో కాంగ్రెస్, టిడిపి కార్యకర్తల మధ్య ఓటు వేసే విషయంలో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో కాంగ్రెస్ పార్గీకి చెందిన చెన్నుపాటి రమేష్‌ను టిడిపి కార్యకర్తలు మూకుమ్మడిగా రాడ్లు, రోకలి బండ్లతో దాడి చేసి ఇష్టం వచ్చినట్లు కొట్టారు. ఈ దాడిలో రమేష్ తలకు, ఇతర శరీర భాగాలకు బలమైన గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో చెన్నుపాటి రమేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనలో మర్రిపూడి ఏడుకొండలు అనే వ్యక్తి ఇచ్చిన పిర్యాదు మేరకు అద్దంకి పోలీసు స్టేషన్ లో Cr.No:110/2009 U/s 143,146,147, 324, 307, 302 R/W 149 IPC & SEC.132,143 పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసు దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన అప్పటి దర్శి డీఎస్పీ షేక్ నజీర్ అహ్మద్ దర్యాప్తు చేసి ముద్దాయిలను తగిన సాక్షాధారాలతో 2009 సంవత్సరం ఏప్రిల్ నెల 28న అరెస్ట్ చేసి రిమాండుకు పంపించారు. అనంతరం తగిన సాక్షాదారాలను సేకరించి నిపుణుల నివేదిక, ప్రత్యేక్ష సాక్షుల వాగ్మూలాలను ఒకదానితో ఒకటి క్రోడీకరించుకొని కోర్టులో 2009 సంవత్సరం డిసెంబర్ 22 న ఛార్జిషీట్ దాఖలు చేశారు. అప్పటి నుంచి కోర్టులో జరిగిన ట్రయల్స్, వాదోపవాదాల అనంతరం నిందితులపై మోపబడిన నేరం రుజువు కావడంతో ఒంగోలు 8వ ADJ కోర్టు న్యాయమూర్తి అమ్మనరాజా మొత్తం 10 మంది నిందితులలో 4 గురికి జీవిత ఖైదు విధించారు. మిగిలిన 6 గురికి మూడేళ్ళ జైలు శిక్ష విధించారు.
జీవిత ఖైదు విధించిన వారిలో జాగర్లమూడి సత్యనారాయణ (35), జాగర్లమూడి శ్రీను (42), జాగర్లమూడి నాగేశ్వరరావు (45), మన్నం రామాంజనేయులు (26) ఉన్నారు. వీరికి జీవిత ఖైదుతో పాటు 5వేల రూపాయల జరిమానా విధించారు. మూడేళ్ళ జైలు శిక్ష విధించిన వారికి జైలు శిక్షతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధించారు. కేసు దర్యాప్తును సక్రమంగా నిర్వహించి ముద్దాయిలకు శిక్షలు పడేలా చేసిన అప్పటి దర్శి డీఎస్పీ షేక్ నజీర్ అహ్మద్, అప్పటి అద్దంకి సీఐ రాంబాబు, ప్రస్తుత పోలీసు అధికారులు, కోర్టు మానిటరింగ్ సిబ్బందిని బాపట్లజిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రత్యేకంగా అభినందించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.