AP Politics: మీకు వాలంటీర్లు.. మాకు కుటుంబ సారథులు.. వైసీపీని ఎదుర్కోవడానికి టీడీపీ కొత్త ప్లాన్..
TDP on AP Volunteers: దీనికి అడ్డుకట్ట వేయాలని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా సాధ్య పడటం లేదు.దీంతో అధికార వైఎస్సార్సీపీ కి చెక్ పెట్టేందుకు వలంటీర్ల తరహాలో కుటుంబ సారధులను నియమిస్తుంది తెలుగుదేశం పార్టీ...వీరి ద్వారా ఇంటింటికీ పార్టీని తీసుకెళ్లే ప్రణాళికలు రూపొందిస్తోంది.గతంలో అధికారం లో ఉన్న సమయంలో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసిన టీడీపీ...ఈసారి కుటుంబ సారధులను నియమిస్తుంది.
విజయవాడ, ఆగస్టు 25: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్సీపీ నియమించిన వలంటీర్ల పై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. వలంటీర్ల ద్వారా ప్రజల డేటాను దొంగిలిస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కూడా వలంటీర్లపై అనేక ఆరోపణలు గుప్పిస్తుంది.ఇక భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం ఓట్ల తొలగింపునకు వలంటీర్లను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు.
వచ్చే ఎన్నికల్లో వలంటీర్ల ను వాడుకుని ప్రభుత్వం ప్రయోజనం పొందాలని చూస్తోందని ప్రతిపక్ష పార్టీల ప్రధాన విమర్శ. అయితే కేవలం సంక్షేమ పథకాల అమలుకు మాత్రమే వలంటీర్ వ్యవస్థను వినియోగిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతుంది.పెన్షన్ల పంపిణీ మొదలు అన్ని పధకాలు వలంటీర్ల వల్లనే సక్రమంగా అందిస్తున్నామనేది ప్రభుత్వ వాదన.. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ నియామకం ద్వారా ఇంటింటికీ ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించగలుగుతుంది.
దీనికి అడ్డుకట్ట వేయాలని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా సాధ్య పడటం లేదు. దీంతో అధికార వైఎస్సార్సీపీ కి చెక్ పెట్టేందుకు వలంటీర్ల తరహాలో కుటుంబ సారధులను నియమిస్తుంది తెలుగుదేశం పార్టీ.. వీరి ద్వారా ఇంటింటికీ పార్టీని తీసుకెళ్లే ప్రణాళికలు రూపొందిస్తోంది.గతంలో అధికారం లో ఉన్న సమయంలో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసిన టీడీపీ…ఈసారి కుటుంబ సారధులను నియమిస్తుంది.
వైసీపీని ఎదుర్కోవడానికి టీడీపీ కొత్త ప్లాన్..
వచ్చే ఎన్నికలకు వెళ్లేందుకు తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆయుధంగా మలచుకుంటుంది వైఎస్సార్సీపీ.. ప్రతి గడపకూ పధకలు తీసుకెళ్లడం లో వలంటీర్ల ది కీలక పాత్ర.ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ ఉండటంతో ప్రభుత్వానికి కూడా పధకాల అమలు ఈజీ అయింది.మొత్తం రెండున్నర లక్షల మంది వలంటీర్ల ను వైసీపీ ప్రభుత్వం నియమించుకుంటున్నది అందుకే తెలుగుదేశం పార్టీ కూడా ఇదే తరహాలో ముందుకెళ్తుంది.
నియజకవర్గాలు, మండలలాలు, గ్రామాలు, పట్టణాల్లో పార్టీలో ఆక్టివ్ గా ఉండే కార్యకర్తల ను కుటుంబ సారథులు గా నియమిస్తుంది. గతంలోనే పార్టీ అధినేత చంద్రబాబు ఈ నియామకాలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తాజాగా పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మరోసారి సర్కులర్ ఇచ్చారు.సెప్టెంబర్ రెండో తేదీ నాటికి నియామకాలు పూర్తి చేయాలని సూచించారు..వలంటీర్ల మాదిరిగా తమకూ ఒక ప్రైవేట్ వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది తెలుగుదేశం పార్టీ.
కుటుంబ సారధులతో టీడీపీ ఏం చేయనుంది?
తెలుగుదేశం కుటుంబ సారథులు నియామకం బాధ్యతలను అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జీలకి అప్పగించారు.ఇప్పటికే నియామక ప్రక్రియ అన్ని నియోజకవర్గాల్లో కొనసాగుతుంది పార్టీలో చురుకుగా ఉండే కార్యకర్తలను కుటుంబ సారథులు గా నియమిస్తారు.సుమారు 6 లక్షల మంది నియామకం చేయాల్సి ఉంటుంది. అయితే కనీస వేతనం లేకుండా నియమించాలంటే అనుకున్న స్థాయిలో పని చేస్తారా అనే అనుమానం కూడా పార్టీలో నెలకొంది.కుటుంబ సారథులు ప్రతి ఇంటికి వెళ్లడం,వారి సమస్యలు తెలుసుకోవడం, వాటిని పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్ళాల్సి ఉంటుంది.తెలుగుదేశం పార్టీ లక్ష్యాలు, అధికారంలోకి వస్తే ఏం చేస్తారు వంటి అన్ని అంశాలు ప్రతి ఇంటికి తీసుకెళ్లే బాధ్యత అప్పగిస్తారు.
కుటుంబ సారథుల ఎంపికను..
దీనిద్వారా ఆయా కుటుంబాల్లో పార్టీ మీద ఉన్న అభిప్రాయం తెలుసుకోవడం,వారి నుంచి సలహాలు తీసుకోవడం కూడా చేస్తారు. ఇలా ప్రజల సమస్యలు, అభిప్రాయాలు తీసుకుని దానికి తగ్గట్టుగా పార్టీ ముందుకెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తారు.కుటుంబ సారథుల ఎంపికను సెప్టెంబర్ 2 నాటికి పూర్తి చేసి వీలైనంత త్వరగా ప్రజల్లోకి వెళ్లేలా టీడీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.మొత్తానికి వలంటీర్ల తో పాటు ఇకపై కుటుంబ సారథులు కూడా గడప గడప కూ రానున్నారు.అయితే టీడీపీ ప్లాన్ ఎంతమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి