Andhra Pradesh: ఏపీలో కాక రేపుతున్న సెల్ఫీ పాలిటిక్స్‌.. వెళ్దాం పదా, నేను రెడీ అంటున్న మంత్రి..

ఏపీలో సెల్ఫీ పాలిటిక్స్‌ కాకరేపుతున్నాయ్‌. అటు చంద్రబాబు, ఇటు లోకేశ్‌ టిడ్కో ఇళ్ల దగ్గర సెల్ఫీలు దిగి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి.. అధికార వైసీపీకి సవాళ్లు విసరడంతో పొలిటికల్‌ సెగలు రాజుకున్నాయ్‌. అదే స్థాయిలో అధికార పార్టీ తరపున మంత్రులు కౌంటర్లు విసరడంతో మేటర్‌ సీరియస్‌గా మారింది.

Andhra Pradesh: ఏపీలో కాక రేపుతున్న సెల్ఫీ పాలిటిక్స్‌.. వెళ్దాం పదా, నేను రెడీ అంటున్న మంత్రి..
Chandrababu
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 09, 2023 | 8:09 AM

ఏపీలో సెల్ఫీ పాలిటిక్స్‌ కాకరేపుతున్నాయ్‌. అటు చంద్రబాబు, ఇటు లోకేశ్‌ టిడ్కో ఇళ్ల దగ్గర సెల్ఫీలు దిగి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి.. అధికార వైసీపీకి సవాళ్లు విసరడంతో పొలిటికల్‌ సెగలు రాజుకున్నాయ్‌. అదే స్థాయిలో అధికార పార్టీ తరపున మంత్రులు కౌంటర్లు విసరడంతో మేటర్‌ సీరియస్‌గా మారింది.

టిడ్కో ఇళ్లపై చంద్రబాబు విసిరిన సెల్ఫీ ఛాలెంజ్‌కు సిద్ధమన్నారు ఏపీ మంత్రి జోగి రమేష్‌. టీడీపీ అధినేతకు జవాబు చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు మంత్రి. పేదలకు వైసీపీ సర్కార్‌ కట్టించిన ఇళ్లు కనిపించడం లేదా అని జోగి ప్రశ్నించారు. కావాలంటే, రాష్ట్రంలోని కోటి 50 లక్షల గడపలకు వెళ్లి అడుగుదాం రమ్మంటూ ప్రతిసవాల్‌ విసిరారు జోగి.

నెగిటివ్‌ ప్రచారంతో చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం గడుపుతున్నారని వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు ఎంత నీతిమంతుడో ప్రజలకు తెలుసని అన్నారు. నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటనతో తమకు కలిగే నష్టం ఏమి లేదన్నారు. సెల్ఫీ ఛాలెంజ్‌ అని చెప్పుకునేందుకు చంద్రబాబు సిగ్గుపడాలని కాకాణి అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..