Andhra Pradesh: రేపల్లెలో కాకరేపుతున్న లిక్కర్ డెత్స్.. నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు..
Andhra Pradesh: రేపల్లెలో లిక్కర్ డెత్స్ రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయ్. మద్యం మరణాలపై మాటల తూటాలు పేల్చుకుంటున్నారు..
Andhra Pradesh: రేపల్లెలో లిక్కర్ డెత్స్ రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయ్. మద్యం మరణాలపై మాటల తూటాలు పేల్చుకుంటున్నారు అధికార, ప్రతిపక్ష నేతలు. తాజాగా బాపట్ల జిల్లాలో లిక్కర్ డెత్స్‌పై సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్. డేంజర్ లిక్కర్ కారణంగానే వాళ్లిద్దరూ మరణించారని అన్నారు. ధన దాహంతో కెమికల్స్ కలిపిన మద్యాన్ని అమ్ముతున్నారని ఆరోపించారు రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్. జనసేన లీడర్స్ కూడా ఇదే తరహా ఆరోపణలు చేశారు. దశలవారీగా మద్యం నిషేధం చేస్తానన్న వైసీపీ ప్రభుత్వం, కల్తీ లిక్కర్‌తో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని అంటున్నారు.
ఇదిలాఉంటే.. టీడీపీ, జనసేన ఆరోపణలపై ఘాటుగా రియాక్టయ్యారు ఎంపీ మోపిదేవి వెంకటరమణ. నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. అనారోగ్యంతో చనిపోయారని కుటుంబ సభ్యులు చెబుతుంటే, మీరెందుకు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, పోటుమెరక గ్రామంలో మద్యం తాగి ఇద్దరు మరణించడం సంచలనం రేపుతోంది. గతంలో జంగారెడ్డిగూడెం, చిలకలూరిపేటలో జరిగిన మరణాలే, ఇప్పుడు రేపల్లెలో జరిగాయని అంటున్నారు టీడీపీ, జనసేన నేతలు. అయితే, ఏం జరిగిందో తేల్చేందుకు ఎంక్వైరీ చేస్తామని ఎంపీ మోపిదేవి వెంకటరమణ చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..