Palasa: రైల్వే స్టేషన్‌లో పోలీసులను చూసి బిత్తర చూపులు.. వెంటనే వెళ్లి వారి బ్యాగులు చెక్ చేయగా

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీస్తుండటంతో పోలీస్ బలగాలు అప్రమత్తం అయ్యాయి. ఎక్కడికక్కడ పటిష్టంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలోనే నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రవాణా చేసే మద్యం, గంజాయి, నగదు, బంగారం వంటి వాటిపై దృష్టిపెట్టారు GRP పోలిసులు. ఈనేపథ్యంలోనే శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్ లో గంజాయి మాఫియా గుట్టు రట్టయింది.

Palasa: రైల్వే స్టేషన్‌లో పోలీసులను చూసి బిత్తర చూపులు.. వెంటనే వెళ్లి వారి బ్యాగులు చెక్ చేయగా
Palasa Railway Station
Follow us
S Srinivasa Rao

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 07, 2024 | 7:28 PM

పలాస, ఫిబ్రవరి 7: పోలిసులు ఎంత నిఘాపెట్టినా.. ఎంతమంది అక్రమార్కులను పట్టుకుంటున్నా ఉత్తరాంధ్రలో గంజాయి అక్రమ రవాణాకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ఎప్పటికప్పుడు గంజాయి మాఫియా రూటు మారుస్తోంది. ఎంతటికైనా తెగిస్తోంది. ఒకప్పుడు పోలిసులు, నిఘా వర్గాల కళ్ళుకప్పి జనారణ్యం లేని మార్గాల గుండా, అడ్డదారులలో సాగే గంజాయి అక్రమ రవాణా ఇప్పుడు ప్రధాన మార్గాల గుండానే దర్జాగా సాగిపోతోంది. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో గుట్టుగా సాగు చేసే గంజాయిని రాజమార్గంలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని ప్రధాన నగరాలతో పాటు, దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎంచెక్కా రవాణా చేసేస్తున్నారు ఆక్రమార్కులు. దీని కోసం పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్‌ను ఎంచుకుంటున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, రైళ్లలో గంజాయిని కావాల్సిన చోటుకి తరలించేస్తున్నారు. ఎవరికి అనుమానం రాకుండా గుంపులో గోవిందయ్యల మాదిరి సాధారణ ప్రయాణికులతో కలిసిపోతూ రాష్ట్ర సరిహద్దులను దాటేస్తూ గంజాయిని గమ్యస్థానాలకు చేర్చేస్తున్నారు.

పలాస రైల్వేస్టేషన్ లో 42కేజీల గంజాయిని పట్టుకున్న GRP పోలీసులు

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీస్తుండటంతో పోలీస్ బలగాలు అప్రమత్తం అయ్యాయి. ఎక్కడికక్కడ పటిష్టంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలోనే నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రవాణా చేసే మద్యం, గంజాయి, నగదు, బంగారం వంటి వాటిపై దృష్టిపెట్టారు GRP పోలిసులు. ఈనేపథ్యంలోనే శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్ లో గంజాయి మాఫియా గుట్టు రట్టయింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు GRP పోలిసులు సోమవారం రైల్వే స్టేషన్ లో తనిఖీలు నిర్వహించారు. వచ్చిపోయే రైళ్లతో పాటు ప్లాట్‌ఫామ్స్‌పైనా తనిఖీలు చేపట్టారు. రెండవ నెంబర్ ప్లాట్ ఫామ్‌పై తనిఖీలు చేస్తుండగా ప్లాట్ ఫామ్ దక్షిణ దిక్కున చివరి భాగంలో ఇద్దరు వ్యక్తుల కదలికలపై అనుమానం వచ్చింది పోలీసులకు. వారిని ప్రశ్నించగా తడబడుతూ సమాధానం చెప్పారు. దీంతో వారి వద్ద ఉన్న నాలుగు బ్యాగులను తనిఖీ చేయగా బ్యాగులలో 21 గంజాయి ప్యాకెట్లతో 42కేజీల గంజాయి దొరికింది. వెంటనే వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా…గంజాయిని ఒరిస్సాలో కొనుగోలు చేసి బెంగుళూరుకు తరలిస్తున్నట్లు నిందితులు తెలిపారు. పట్టుబడిన ఇద్దరు నిందితులు ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా బ్రహ్మరాపూర్ కి చెందిన శంకరం మిశ్రా, సరోజ్ కుమార్ సాహులుగా గుర్తించారు పోలిసులు. ఒడిశా లోని బిఎన్పూర్ నుంచి గంజాయిని తరలిస్తున్నట్లు నిందితులు అంగీకరించారు.కేసు నమోదు చేసి ముద్దాయిలను అరెస్ట్ చేసి విశాఖపట్నం కోర్టులో హాజరుపరిచారు.

తాజాగా మంగళవారం పలాస రైల్వేస్టేషన్ వద్ద పట్టుబడిన మరో ముఠా….

సోమవారం పలాస రైల్వే స్టేషన్ నుంచి బెంగళూరుకు గంజాయిని తరలిస్తూ ఇద్దరు సభ్యుల ముఠా పట్టుబడితే…అది జరిగిన మరుసటిరోజే రైలులో చెన్నైకు గంజాయిని తరలించేందుకు సిద్ధమయిన మరో ముఠా పట్టుబడింది. ఎంచక్కా ప్రయాణికుల ముసుగులో రైలు ఎక్కి చెన్నైకి చెక్కెందుకు సిద్దం అయిన క్రమంలోనే తమిళనాడుకు చెందిన తల్లీ, కుమారుడు లత, రాజారామ్‌లతో పాటు మరో మహిళ ఎం.రాధ 10కేజీల గంజాయితో పోలీసులకు పట్టుబడ్డారు. తమిళనాడుకు చెందిన తల్లీ కొడుకులిద్దరు మెళియాపుట్టి మండలం గొప్పిలి గ్రామం వద్ద ఒడిశాలోని పర్లాకిమిడికి చెందిన ఎన్.అప్పారావు అనే వ్యక్తి వద్ద రాధ సహాయంతో 10 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. వాటిని రెండు ప్యాకెట్లుగా చేసి రెండు బ్యాగుల్లో అమర్చి చెన్నైకి తీసుకువెళ్లేందుకు పలాస రైల్వే స్టేషన్ కి చేరుకున్నారు. అయితే అప్పటికి ముందస్తు సమాచారం ఉన్న పోలిసులు మఫ్టీలో మాటు వేసి రైల్వే స్టేషన్ బయటే వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా వారిచ్చిన సమాచారంతో గంజాయిని అందించిన పర్లాకిమిడికి చెందిన ఆనంద్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. పట్టుబడిన నిందితులు గత కొంత కాలంగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

మొత్తానికి దొరికితే దొంగ…దొరకకపోతే దొర అన్నట్టు వ్యవహరిస్తున్నారు అక్రమార్కులు. నేరగాళ్లు అక్రమ రవాణాకు ప్రయాణికుల ముసుగులో ఏకంగా రైళ్లనే ఎంచుకోవటం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల నేపథ్యంలో పోలీసు, నిఘా వర్గాలు అప్రమత్తం అవ్వటంతో పలాస రైల్వే స్టేషన్ కేంద్రంగా రెండు రోజుల వ్యవధిలో వరుసగా రెండు గంజాయి ముఠాలు పట్టుబడటం కలకలం రేపుతోంది. ఈ ఘటనతో అయినా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ పై ప్రత్యేక నిఘా ఉండాలని కోరుతున్నారు స్థానికులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వేలంలో అన్‌సోల్డ్.. కట్‌చేస్తే.. 28 బంతుల్లో సెంచరీతో షాక్
వేలంలో అన్‌సోల్డ్.. కట్‌చేస్తే.. 28 బంతుల్లో సెంచరీతో షాక్
వీళ్లు కొడుకులు కారు యమకింకరులు..
వీళ్లు కొడుకులు కారు యమకింకరులు..
IPL 2025: క్రికెటర్ల జీతాల విధానం, చెల్లింపు ప్రక్రియ వివరాలు
IPL 2025: క్రికెటర్ల జీతాల విధానం, చెల్లింపు ప్రక్రియ వివరాలు
నయనతారపై కేసు పెట్టిన ధనుష్.. వ్యవహారం ఎటు వెళ్తుందో..?
నయనతారపై కేసు పెట్టిన ధనుష్.. వ్యవహారం ఎటు వెళ్తుందో..?
క్రిస్మస్ నెలలో సినిమాల సందడి.. డిసెంబర్‎లో రానుంది ఎవరు.?
క్రిస్మస్ నెలలో సినిమాల సందడి.. డిసెంబర్‎లో రానుంది ఎవరు.?
ఉచితంగా ఆధార్ కార్డు అప్‌డేట్.. గడువు దాటిందంటే చార్జీల మోతే
ఉచితంగా ఆధార్ కార్డు అప్‌డేట్.. గడువు దాటిందంటే చార్జీల మోతే
రోజ్ వాటర్ వల్ల కలిగే అద్భుతమైన లాభాలు తెలిస్తే.. వదలరు
రోజ్ వాటర్ వల్ల కలిగే అద్భుతమైన లాభాలు తెలిస్తే.. వదలరు
సైబర్ నేరగాళ్ల కొత్త తరహా మోసం.. ఖాతాదారులను హెచ్చరించిన ఎస్బీఐ
సైబర్ నేరగాళ్ల కొత్త తరహా మోసం.. ఖాతాదారులను హెచ్చరించిన ఎస్బీఐ
డైరీ రంగంలో భారత్‌దే అగ్రస్థానం.. ఇదిగో ఆసక్తికర వివరాలు
డైరీ రంగంలో భారత్‌దే అగ్రస్థానం.. ఇదిగో ఆసక్తికర వివరాలు
ఆ విద్యార్థిని కోసం ప్రభుత్వం ఎన్ని లక్షలు ఖర్చు చేస్తుందో తెల్సా
ఆ విద్యార్థిని కోసం ప్రభుత్వం ఎన్ని లక్షలు ఖర్చు చేస్తుందో తెల్సా
అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్.! పెళ్లి తేదీని త్వరలో ప్రకటించనున్న
అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్.! పెళ్లి తేదీని త్వరలో ప్రకటించనున్న
నిద్ర ఎవరికి ఎంత అవసరం.? ఎవరు ఎంతసేపు నిద్రపోతే హార్మోన్స్ ప్రాబ్
నిద్ర ఎవరికి ఎంత అవసరం.? ఎవరు ఎంతసేపు నిద్రపోతే హార్మోన్స్ ప్రాబ్
నేనేం భయపడట్లే.. ఇప్పుడు నాకు కుదరదు.! RGV వీడియో.
నేనేం భయపడట్లే.. ఇప్పుడు నాకు కుదరదు.! RGV వీడియో.
కిస్సిక్ సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్‌పై సమంత రియాక్షన్.! వీడియో..
కిస్సిక్ సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్‌పై సమంత రియాక్షన్.! వీడియో..
పెళ్లిలో పాత సంప్రదాయాన్ని పాటించేందుకు నాగ చైతన్య నిర్ణయం.!
పెళ్లిలో పాత సంప్రదాయాన్ని పాటించేందుకు నాగ చైతన్య నిర్ణయం.!
హనుమాన్ హీరో తేజ సజ్జ కు పెద్దాయన పాదాభివందనం.! వీడియో వైరల్..
హనుమాన్ హీరో తేజ సజ్జ కు పెద్దాయన పాదాభివందనం.! వీడియో వైరల్..
పుష్ప2 నటుడు శ్రీ తేజ్‌పై కేసునమోదు! పెళ్లి చేసుకుంటానని నమ్మించి
పుష్ప2 నటుడు శ్రీ తేజ్‌పై కేసునమోదు! పెళ్లి చేసుకుంటానని నమ్మించి
రెహ్మాన్‌తో రిలేషన్ పై ఎట్టకేలకు నోరు విప్పిన మోహిని.! వీడియో..
రెహ్మాన్‌తో రిలేషన్ పై ఎట్టకేలకు నోరు విప్పిన మోహిని.! వీడియో..
అఖిల్‌కు ఎంగేజ్‌మెంట్ అయిపోయింది.. ఆ అమ్మాయి ఈమే.!
అఖిల్‌కు ఎంగేజ్‌మెంట్ అయిపోయింది.. ఆ అమ్మాయి ఈమే.!
అయ్యో.! పొలం పనులు చేస్తుండగా ఊహించని సీన్..
అయ్యో.! పొలం పనులు చేస్తుండగా ఊహించని సీన్..