AP Budget: రూ.2.86 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌.. హైలెట్స్ ఇవే

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఏడు అంశాల ఆధారంగా బడ్జెట్‌ను రూపకల్పన చేశామన్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, సుపరిపాలన, సామర్థ్య ఆంధ్ర, మన మహిళా మహారాణుల ఆంధ్ర, సంపన్నల ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, భూభద్ర ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర అనే 7 అంశాల ఆధారంగా బడ్జెట్ రూపొందించామన్నారు.

AP Budget: రూ.2.86 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌.. హైలెట్స్ ఇవే
Buggana Rajendranath Reddy
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 07, 2024 | 7:05 PM

అమరావతి, ఫిబ్రవరి 7: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఎన్నికల ఏడాది కావడంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను… ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2.86 లక్షల వ్యయ అంచనాలతో ఈ బడ్జెట్‌ను రూపొందించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,30,110 41 కోట్లు కాగా… మూలధన వ్యయం రూ.30,530.18 కోట్లుగా ప్రతిపాదించారు. అలానే.. బడ్జెట్‌లో రెవిన్యూ లోటును రూ.24,758. 22 కోట్లుగా చూపారు. ద్రవ్య లోటును రూ. 55,817.50 కోట్లుగా చూపారు.

జీఎస్డీపీలో ద్రవ్య లోటు 3.51 శాతంగా తెలిపారు. అలానే.. రెవిన్యూ లోటు 1.56 శాతంగా తేలింది. ఐదేళ్ల పాలనలో అద్భుతమైన విజయాలు సాధించగలిగామన్నారు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌. ఏడు అంశాల ఆధారంగా బడ్జెట్‌ను రూపకల్పన చేశామన్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, సుపరిపాలన, సామర్థ్య ఆంధ్ర, మన మహిళా మహారాణుల ఆంధ్ర, సంపన్నల ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, భూభద్ర ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర అనే 7 అంశాల ఆధారంగా బడ్జెట్ రూపొందించామన్నారు. గత ఐదేళల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో పాటుగా సాధించిన విజయాలను ప్రసంగంలో ప్రస్తావించారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.

2018-19 సంవత్సరంలో రాష్ట్ర వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 8.3 శాతంతో 12వ స్థానంలో ఉండగా.. ఇప్పుడు రాష్ట్రం 13% వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ది రేటుతో 6వ స్థానంలో ఉంది. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని రైతులందరికీ వర్తింపచేసిన మొదటి, ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రైతుభరోసా ద్వారా 33వేల కోట్ల ఆర్థిక సాయం రైతులకు అందిందన్నారు మంత్రి బుగ్గన.

గత ఐదేళ్లలో 4లక్ష 95వేల కొత్త ఉద్యోగాలు ఇచ్చామన్నారు మంత్రి బుగ్గన, దాదాపు 10 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగాల క్రమబద్ధీకరణ చేశామని…, అలానే.. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలకు పెంచామన్నారు. గతంలో కంటే భిన్నంగా సాగింది ఏపీ మంత్రి బుగ్గన బడ్జెట్ ప్రసంగం. నాలుగున్నర ఏళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించిన మంత్రి.. వివిధ శాఖలకు కేటాయించిన నిధుల వివరాలను సభ ముందుంచారు. తాము చేపట్టిన సంక్షేమ పథకాలతో అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపామన్న ఆయన.. వాటికి సంబంధించిన ప్రత్యక్ష సాక్ష్యాలను సభలో ఉంచారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టామన్న మంత్రి బుగ్గన… వెయ్యి పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ అమల్లోకి తీసుకొచ్చామన్నారు. రూ.3,367 కోట్లతో జగనన్న విద్యాకానుక అమలు చేస్తున్నామన్నారు. 47 లక్ష మంది విద్యార్థులకు విద్యా కానుక ఇచ్చామన్నారు. జగన్నన గోరుముద్ద పథకం కోసం రూ.1910 కోట్లు ఖర్చు చేశామన్నారు. 9,52,925 ట్యాబ్స్‌ విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశామని మంత్రి చెప్పారు. రూ.11,901 కోట్లతో జగనన్న విద్యాదీవెన పథకానికి ఖర్చు చేశామని, విదేశీ విద్యాదీవెన కింద 1,858 మందికి లబ్ధి చేకూర్చామన్నారు. రూ.4,267 కోట్లు జగనన్న వసతీ దీవెన ఖర్చు చేశామని మంత్రి బుగ్గన వెల్లడించారు. 20.37 శాతం నుంచి 6.62 శాతానికి డ్రాప్‌ అవుట్‌ తగ్గించామన్నారు.

గత ప్రభుత్వంతో పోలిస్తే ఎప్పుడూ లేని విధంగా పెన్షన్లు ఇచ్చామన్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.  వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొదటి నాలుగు నెలల అవసరాల కోసం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రతిపాదనల్ని ఆర్ధిక మంత్రి సభ ముందుంచారు. వీటిలో వచ్చే ఏప్రిల్, మే, జూన్, జులై నెలల కోసం రూ.88,215 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు చేశారు. ఎన్నికల తర్వాత మరోసారి బడ్జెట్ భేటీ పెట్టి… మిగిలిన ప్రతిపాదనల్ని ఆమోదించనున్నారు. ఆలోపు ఓటాన్ అకౌంట్‌లో ఆమోదించిన మేరకు… ఖర్చు చేసుకునేందుకు ప్రభుత్వానికి అవకాశం లభిస్తుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..