AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Murder: కన్నతల్లినే కడచేర్చిన కసాయి కొడుకు.. హత్యకు కారణం ఇదే..

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాతన కొత్తూరు గ్రామంలో పచ్చర్లపల్లి లక్ష్మీదేవి(44) భర్త కృష్ణారెడ్డి ఏడేళ్ల కిందట అనారోగ్యంతో మరణించారు. ఈ దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు లిఖిత్ కుమార్ రెడ్డి ఉన్నారు. కుమార్తె వివాహమై భర్త చనిపోవడంతో తనకున్న 11 ఎకరాల పొలాన్ని కూతురు పేరు మీద ఐదున్నర ఎకరాలు రిజిస్టర్ చేయించారు తల్లి లక్ష్మీదేవి. మిగతాది ఐదున్నర ఎకరాల పొలం కొడుకు పేరు మీద జాయింట్‎గా పట్టాదార్ పాస్ పుస్తకాలు చేయించారు.

Murder: కన్నతల్లినే కడచేర్చిన కసాయి కొడుకు.. హత్యకు కారణం ఇదే..
Mother's Murder
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Jan 20, 2024 | 12:22 PM

Share

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాతన కొత్తూరు గ్రామంలో పచ్చర్లపల్లి లక్ష్మీదేవి(44) భర్త కృష్ణారెడ్డి ఏడేళ్ల కిందట అనారోగ్యంతో మరణించారు. ఈ దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు లిఖిత్ కుమార్ రెడ్డి ఉన్నారు. కుమార్తె వివాహమై భర్త చనిపోవడంతో తనకున్న 11 ఎకరాల పొలాన్ని కూతురు పేరు మీద ఐదున్నర ఎకరాలు రిజిస్టర్ చేయించారు తల్లి లక్ష్మీదేవి. మిగతాది ఐదున్నర ఎకరాల పొలం కొడుకు పేరు మీద జాయింట్‎గా పట్టాదార్ పాస్ పుస్తకాలు చేయించారు. అయితే 11 ఎకరాలు తన పేరు మీద రాయాలని కుమారుడు తల్లితో కొంతకాలంగా గొడవ పడుతున్నాడు.

ఈ విషయంలో లికిత్ రెడ్డి పెద్దనాన్న లింగారెడ్డి సహకారం ఉందని తెలిసింది. ఉదయం పొలం విషయమై ఇంట్లో తల్లి కుమారుడు గొడవపడ్డారు, కోపంతో కుమారుడు తల్లి లక్ష్మీదేవి తలపై ఇనుపరాడుతో బలంగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. చుట్టుపక్కల వారు వచ్చి చూసేసరికి రక్తపు మడుగులో పడి ఉంది. ఈమె మరణించినట్లు నిర్థారించారు స్థానికులు. హత్యకు సంబంధించిన సమాచారం అందుకున్న పత్తికొండ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి సంఘటన స్థాలానికి చేరుకొని విచారణ చేపట్టారు. హత్యకు ఉపయోగించిన రాడును స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి తల్లి హనుమంతమ్మ ఫిర్యాదు మేరకు లిఖిత్ కుమార్ రెడ్డి, లింగారెడ్డి పై హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కలలో దారి తప్పిపోవడం అశుభమా? జీవితంలోని అయోమయానికి సంకేతమా?
కలలో దారి తప్పిపోవడం అశుభమా? జీవితంలోని అయోమయానికి సంకేతమా?
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...