ఇంటి నుంచి వస్తోన్న దుర్వాసన.. పైగా లోపల నుంచి ఏవేవో వింత శబ్దాలు.. సీన్ కట్ చేస్తే.!

స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్.! ఓ ఇంట్లో ముగ్గురు చేరారు.. అంతా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులే.. పైగా స్నేహితులు. వారిలో ఇద్దరిది సీనియర్ మేనేజర్ స్థాయి.. చీకటి పడగానే ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఓ వ్యక్తి వచ్చి ప్రశ్నించగానే ఇంటి తలుపులు మూసేశారు.

ఇంటి నుంచి వస్తోన్న దుర్వాసన.. పైగా లోపల నుంచి ఏవేవో వింత శబ్దాలు.. సీన్ కట్ చేస్తే.!
Representative Image
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Ravi Kiran

Updated on: Jan 19, 2024 | 8:36 PM

స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్.! ఓ ఇంట్లో ముగ్గురు చేరారు.. అంతా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులే.. పైగా స్నేహితులు. వారిలో ఇద్దరిది సీనియర్ మేనేజర్ స్థాయి.. చీకటి పడగానే ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఓ వ్యక్తి వచ్చి ప్రశ్నించగానే ఇంటి తలుపులు మూసేశారు. ఇంట్లో గొర్రె కళేబరం రక్తపు మడుగులో ఉంది. సమాధానం దాటవేయడంతో అనుమానం మొదలైంది. పుకార్లు షికార్లు చేశాయి. స్థానికులు గుమిగూడారు. తలుపులు తట్టినా స్పందన లేదు. వాళ్లకున్న అనుమానాలు మరింత బలపడుతూ వచ్చాయి. ఇంతలో ఫిర్యాదుతో పోలీసులు రంగప్రవేశం చేశారు. అప్పుడూ తొలుత తలుపులు తీయలేదు. బలవంతంగా లోపలికి వెళ్లారు పోలీసులు. ముగ్గురూ మద్యం మత్తులో ఉన్నారు. కింద కళేబరం. ఆ పక్కనే దేవతామూర్తుల విగ్రహాలు.. వాళ్ల సమాధానాలపై అనుమానం వచ్చి స్టేషన్‌కు తరలించారు. చివరికి..!

విశాఖ స్టీల్ ప్లాంట్ టౌన్‌షిప్‌లోని సెక్టర్ 9. క్వార్టర్ నంబర్ 315 B. గోపికృష్ణ అనే స్టీల్ ప్లాంట్ ఉద్యోగి నివసిస్తున్నాడు. రమేష్ కుమార్, శంకర్ నారాయణ అనే మరో ఇద్దరు స్నేహితులు కూడా తోడయ్యారు. ముగ్గురు ఒకే ఇంట్లోనే ఆ సమయంలో ఉన్నారు. ఓ వ్యక్తి వచ్చి వారిని నిలదీశాడు. వాళ్లకు ఆ వ్యక్తికి మధ్య వాగ్వాదం జరిగింది. ఇంటి మధ్యలో గొర్రె కళేబరం ఉన్నట్టు సమాచారం బయటకుపోయింది. రక్తపు మడుగులో మేక కళేబరం ఉన్నట్టు సమాచారం ఆ నోటా ఈ నోటా ప్రచారం ఊపందుకుంది. స్థానికులు వెళ్లి చూసేందుకు ప్రయత్నించారు. తలుపు వేసుకున్నారు. తలుపులు తట్టిన తీసే పరిస్థితుల్లో లేరు. దీంతో అనుమానం మరింత పెరిగింది. ఈలోగా.. ఆ ముగ్గురిని నిలదీసిన వ్యక్తి పోలీసులకు సమాచారం అందించారు. ఆలస్యం అవుతున్న కొద్దీ అక్కడ పరిస్థితితో వేర్వేరు రకాల పుకార్లు ఊపందుకున్నాయి. ఒకానొక సందర్భంలో లోపల ఏవైనా పూజలు జరిగాయా అన్న అనుమానం కూడా కలిగింది స్థానికులకు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఇంటి తలుపు తట్టి బలవంతంగా లోపలికి వెళ్లారు. ఇంటి మధ్యలో గొర్రె కళేబరం రక్తపు మడుగులో పడి ఉంది. ముగ్గురు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆ ఇంట్లో మద్యం మత్తులో ఉన్నట్టు తెలుసుకుని అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. దీంతో సీఐ, ఏసీపీ త్రినాధరావు స్వయంగా అక్కడికి వెళ్లి పరిశీలించారు. అక్కడే దేవతామూర్తుల విగ్రహాలు ఉండడంతో తొలుత కాస్త అనుమానించినా.. విచారణ తర్వాత దొంగలించిన మేకను వధించినట్టు గుర్తించారు పోలీసులు. మద్యం మత్తులో ఉన్నట్టు తెలుసుకుని గోపికృష్ణ, రమేష్ కుమార్, శంకర్ నారాయణ్ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు ఏసీపీ త్రినాధరావు.

అసలు విషయం ఇదే!

గోపికృష్ణ అనే స్టీల్ ప్లాంట్ ఉద్యోగి ఇంట్లో.. తన స్నేహితులు శంకర్ నారాయణ, రమేష్ కుమార్‌తో కలిసి మందు పార్టీ చేసుకున్నారు. ఇంతలో దేశపాత్రునిపాలెంకి చెందిన.. ఓ మేకల మంద మేత కోసం అటుగా వెళ్ళింది. సాయంత్రానికి ఆ మందలోని మేకలను గొర్రెలను లెక్క కట్టేసరికి ఒక గొర్రె తప్పినట్టు గుర్తించాడు యజమాని ఉరటి పైడిరాజు. దీంతో అనుమానం వచ్చి.. మేతకు వెళ్లిన ప్రాంతంలో వెతికాడు. గోపికృష్ణ క్వాటర్ వద్దకు వెళ్లి వాళ్లను అడిగాడు పైడ్రాజు. దీంతో తామే గొర్రెను కోసేసామని బేలగా సమాధానం ఇచ్చారు. లోపలికి వెళ్లి చూస్తే నిజమే.. ఇంటి నడి మధ్యలో వధించి కళేబరం పడి ఉంది. అదేంటని ప్రశ్నిస్తే ముగ్గురు కలిసి.. పెరటి చెట్లు తినేయడంతో గొర్రెను తెచ్చి పీక కోసమని బదులిచ్చారు. పైడి రాజును బయటకు తోసేసి తలుపులు మూసేశారు. మళ్లీ తలుపు తట్టినా తీయకపోయేసరికి.. స్థానికంగా కలకలం రేగింది. గొర్రెను వధించడం నిజమే అయినప్పటికీ.. వాళ్ల ప్రవర్తనతో అనుమానాలు, పుకార్లు షికార్లు చేశాయి. అది కూడా ఇంటి నడి మధ్యలో గొర్రెను వధించడంతో పూజలు జరిగాయా అన్న అనుమానం కూడా ఒకానొక దశలో మొదలైంది. ఇక అక్కడ పరిస్థితిని బట్టి ఏసీపీ స్థాయి అధికారే స్వయంగా రంగంలోకి దిగారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని.. ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఒక్కొక్కరిని విచారించి అక్కడ పూజలు ఏవి జరగలేదని గుర్తించారు పోలీసులు. తమ పెరటి మొక్కలను ధ్వంసం చేయడమే కాకుండా.. ఇంట్లోకి చొరబడినందుకు గొర్రెను పట్టుకొని వధించినట్టు పోలీసులకు చెప్పారు. ఇదే విషయాన్ని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించుకొని ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించామని అన్నారు ఏసీపీ త్రినాధరావు. మేకను దొంగలించినందుకు ఒక సెక్షన్, వధించినందుకు మరో సెక్షన్ కింద కేసు నమోదు చేశామని అన్నారు.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!