Ayyanna Patrudu: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదు.. సీఎంపై వ్యాఖ్యలతో అట్టుడుకుతోన్న ఏపీ

Ram Naramaneni

Ram Naramaneni |

Updated on: Sep 18, 2021 | 12:58 PM

కర్రలు లేచాయ్.. రాళ్లు పైకి ఎగిరాయ్.. అద్దాలు పగిలాయ్.. టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ.. న భూతో.. న భవిష్యత్ అన్నట్టుగా జరిగింది. తాజాగా ఇరు వర్గాలపై కేసులు నమోదయ్యాయ్.

Ayyanna Patrudu: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదు.. సీఎంపై వ్యాఖ్యలతో అట్టుడుకుతోన్న ఏపీ
Ayyanna Patrudu

ఏపీలో పొలిటికల్‌ వార్‌ కొనసాగుతోంది. టీడీపీ,  వైసీపీ వర్గాలు అస్సలు వెనక్కి తగ్గడం లేదు. నిన్నటి దాడి ఘటనపై మాటల యుద్ధం నడుస్తోంది. అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగుతోంది.  టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై గుంటూరు జిల్లా నకరికల్లు పోలీస్​స్టేషన్​లో కేసు నమోదైంది. కండ్లకుంటలో జరిగిన కోడెల వర్ధంతి సభలో అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై మాజీ సర్పంచ్, వైసీపీ నేత కంఠంనేని కోటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతో అయ్యన్నపాత్రుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి, హోం మంత్రి, ఐపీఎస్ అధికారులను కించపరిచేలా అయ్యన్నపాత్రుడు మాట్లాడారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

అయ్యన్న మాటల వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఎమ్మెల్యే జోగి రమేశ్ ఆరోపిస్తున్నారు. క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రంలో తిరగనివ్వమంటూ హెచ్చరించారు ఎమ్మెల్యే. నిన్న జరిగింది ఆరంభం మాత్రమేనని, భాష మారకపోతే అది కంటిన్యూ అవుతుందని వార్నింగ్‌ ఇచ్చారు జోగి రమేష్‌. మరి అయ్యన్న సారీ చెప్తారా.. లేదంటే యుద్ధాన్ని కొనసాగిస్తారా.. అనేది ఉత్కంఠగా మారింది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కండ్లకుంటలో  సీఎం జగన్‌పై చేసిన కొన్ని కామెంట్సే ఇంతటి యుద్ధానికి దారితీశాయి.

అటు అయ్యన్నపాత్రుడి కామెంట్స్‌‌పై ఎమ్మెల్యే రోజా రియాక్ట్‌ అయ్యారు. కోడెలకు చంద్రబాబు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకుండా మానసిక క్షోభకు గురిచేసినప్పుడు అయ్యన్న ఏమైయ్యారని ఆమె ప్రశ్నించారు. అయ్యన్నపాత్రుడు ఎమ్మెల్యే పదవి పీకేశారు… మంత్రి పదవి పీకేశారు…చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి పీకేశారు…రాష్ట్రంలో తెలుగుదేశం జెండా పీకేశారు…ఇంకా ఏం పీకాలి అంటూ విమర్శలు గుప్పించారు.

ఇక ఉండవల్లిలో చంద్రబాబు నివాసం వద్ద జరిగిన ఘటనలపై తాడేపల్లి పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇరు వర్గాలపై మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి. టీడీపీ నేతలు  జంగాల సాంబశివరావు, తిరుమలయ్య, బుస్సా మధుసూదన్ రావు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మూడు కేసులు నమోదయ్యాయి. మరోవైపు జోగి రమేష్ డ్రైవర్ తాండ్ర రాము ఫిర్యాదుతో టీడీపీ నేతలపై ఐపీసీ సెక్షన్లతోపాటు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం సెక్షన్ 3(1), 3(2) కింద, IPC సెక్షన్‌ 144, 148, 149, 188, 269, 270, 294బి, 341, 352, 427. 506 సెక్షన్ల కింద కేసు పెట్టారు.

Also Read: ఏపీ మంత్రివ‌ర్గంలో ఎప్పుడైనా మార్పులు జరిగే అవ‌కాశం! సీఎం జ‌గ‌న్ సంకేతాలు!

 ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల అమ్మకం.. సినీ వర్గాలతో ఏపీ సర్కార్ కీలక మీటింగ్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu