నిత్యపెళ్లి కొడుకు గుట్టురట్టు
ఒకరికి తెలియకుండా మరోకరి పెళ్లి చేసుకున్నాడు..అలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు అమ్మాయిలకు తాళికట్టాడు ఓ ప్రబుద్ధుడు. అనంతపురం జిల్లాలో నిత్యపెళ్లికొడుకు గుట్టురట్టు చేశారు పోలీసులు. అనంతపురం జిల్లా గోరంట్ల మండలం బుద్దివాండ్ల పల్లికి చెందిన రంగప్ప అనే వ్యక్తి ముగ్గురు అమ్మాయిలను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఇంతటితో ఆగకుండా అనంతపురానికి చెందిన అమ్మాయితో నాలుగో పెళ్లికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న మూడో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిత్యపెళ్లికొడుకు […]
ఒకరికి తెలియకుండా మరోకరి పెళ్లి చేసుకున్నాడు..అలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు అమ్మాయిలకు తాళికట్టాడు ఓ ప్రబుద్ధుడు. అనంతపురం జిల్లాలో నిత్యపెళ్లికొడుకు గుట్టురట్టు చేశారు పోలీసులు. అనంతపురం జిల్లా గోరంట్ల మండలం బుద్దివాండ్ల పల్లికి చెందిన రంగప్ప అనే వ్యక్తి ముగ్గురు అమ్మాయిలను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఇంతటితో ఆగకుండా అనంతపురానికి చెందిన అమ్మాయితో నాలుగో పెళ్లికి సిద్ధమయ్యాడు.
విషయం తెలుసుకున్న మూడో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిత్యపెళ్లికొడుకు రంగప్పను అరెస్ట్ చేశారు. నిందితుడు రంగప్ప ఫోన్ కాల్స్ ద్వారా యువతులను పరిచయం చేసుకుని ..వారిని నమ్మించి పెళ్లి చేసుకున్న తర్వాత డబ్బు, బంగారంతో పారిపోవడం అలవాటుగా చేసుకున్నాడని పోలీసులు తేల్చారు. చాలా నిరుద్యోగులను కూడా అతడు మోసం చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయని, ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి నుంచి రూ.10లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయని పోలీసుల వెల్లడించారు.