అవతరణ దినోత్సవంపై అదే రగడ..ఏపీలో ఏంజరుగుతుందంటే ?
ఏపీ రాజధానిపై ఇప్పటికే రగడ కొనసాగుతోంది. మరోవైపు హైకోర్టుపైనా ఆంధ్రప్రదేశ్‌లో రోజుకో పంచాయితీ జరుగుతోంది. తాజాగా ఇప్పుడు రాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా రచ్చగా మారింది. చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లపాటు ఆపేసిన అవతరణ వేడుకల్ని జగన్ సర్కార్ తిరిగి ప్రారంభిస్తోంది. నవంబర్ 1న ఏపీ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించ తలపెట్టిందది జగన్ ప్రభుత్వం. అయితే, టీడీపీ మాత్రం ఈ చర్యను వ్యతిరేకిస్తూ- తామేది చేస్తే రివర్స్‌గా వెళ్లడమే జగన్ విధానమంటూ ఎద్దేవా చేస్తోంది. రాష్ట్రావతరణ వేడుకులపై సాగుతున్న […]
ఏపీ రాజధానిపై ఇప్పటికే రగడ కొనసాగుతోంది. మరోవైపు హైకోర్టుపైనా ఆంధ్రప్రదేశ్‌లో రోజుకో పంచాయితీ జరుగుతోంది. తాజాగా ఇప్పుడు రాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా రచ్చగా మారింది. చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లపాటు ఆపేసిన అవతరణ వేడుకల్ని జగన్ సర్కార్ తిరిగి ప్రారంభిస్తోంది. నవంబర్ 1న ఏపీ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించ తలపెట్టిందది జగన్ ప్రభుత్వం. అయితే, టీడీపీ మాత్రం ఈ చర్యను వ్యతిరేకిస్తూ- తామేది చేస్తే రివర్స్‌గా వెళ్లడమే జగన్ విధానమంటూ ఎద్దేవా చేస్తోంది. రాష్ట్రావతరణ వేడుకులపై సాగుతున్న రణం రాజకీయ వర్గాల్లో హీట్ పుట్టిస్తోంది.
ఆంధ్ర ప్రాంతం.. మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి విడిపోయి 1953లో ఆంధ్రరాష్ట్రంగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే జిల్లాలను కలుపుకుని 1956లో ఆంధ్రప్రదేశ్‌గా అవతరించింది. ఆ తర్వాత పలు రాజకీయ పరిణామాలు.. దశాబ్ధాల తరబడి జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ఫలితంగా 2014లో తెలంగాణ ప్రాంతం ఏపీ నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత- నవంబర్ ఒకటిన అవతరణ వేడుకలు ఆగిపోయాయి.
ఆ తర్వాత జూన్ రెండున తెలంగాణ రాష్ట్రం అవతరణ దినోత్సవాన్ని నిర్వహిస్తుండగా.. ఏపీలో నవంబర్ 1కి బదులు జూన్ 2న నవనిర్మాణ దీక్షను చంద్రబాబు ఐదేళ్లు నిర్వహించారు. అయిదేళ్ళుగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇటీవల ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం- రాష్ట్రావతరణ వేడుకలను నవంబర్ 1న నిర్వహించాలని నిర్ణయించింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
అయితే, నవంబర్ 1 మీద టీడీపీ తీవ్ర అభ్యంతరం చెబుతోంది. చంద్రబాబు వ్యతిరేకతను తిప్పికొడుతోంది అధికారపార్టీ. బెంజ్‌సర్కిల్‌లో కోట్లు ఖర్చుపెట్టి నవనిర్మాణ దీక్షలతో జనాన్ని ఇబ్బందిపెట్టారంటూ టీడీపీకి వైసీపీ కౌంటర్ ఇస్తోంది. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తుచేసుకోవడానికే అవతరణ వేడుకలంటోంది ప్రభుత్వం. నిజానికి రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టంలో ఏపీని విభజిత, అవశేష ఆంధ్రప్రదేశ్‌గానే ప్రస్తావించారు. సో.. ఏపీ రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయింది కానీ రాష్ట్రం కేంద్ర గెజిట్ నవంబర్ 1న ఏర్పడినట్లుగానే నోటిఫై అయి వుంది. కాబట్టి నవంబర్ 1నే రాష్ట్ర అవతరణదినోత్సవాన్ని జరుపుకోవడం సమంజసమని అధికార పార్టీ వాదిస్తోంది.
అధికార, ప్రతిపక్షాల అవతరణ యుద్ధాన్ని బీజేపీ కొట్టిపారేసింది. వీలైతే నవంబర్ 1ని, జూన్ 2ని పండగలా జరుపుకోవచ్చనీ, ఈ మాత్రం దానికి రాజకీయం ఎందుకని ప్రశ్నిస్తోంది కాషాయ సైన్యం. రాష్ట్రంలో ఇప్పటికే రాజధానిపై అనిశ్చితి, హైకోర్టు కోసం రాయసీమలో ఉద్యమాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటితోపాటు అవతరణ దినోత్సవం కూడా సెంటిమెంట్ కావడమే అసలైన రాజకీయ రచ్చ.