టీటీడీ కీలక నిర్ణయం: తిరుమల నుంచి వంద మంది ఔట్..!! ఎందుకు..?
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. టీటీడీలో పనిచేస్తోన్న వంద మందికి ఉద్వాసన పలికేందుకు రెడీ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు.. గురువారం తెలపనుందని సమాచారం. ఈ వంద మందితో పాటు.. టీటీడీలో కీలక సభ్యుడు.. డాలర్ శేషాద్రికి కూడా చెక్ పడినట్టు సమాచారం. టీటీడీ తీసుకోనున్న సంచలన నిర్ణయమేంటంటే.. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో పనిచేస్తున్న రిటైర్డ్ అధికారులు, సిబ్బందిని తొలగించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్థాయిలో పనిచేస్తోన్న అధికారులను తొలగించాలని.. […]
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. టీటీడీలో పనిచేస్తోన్న వంద మందికి ఉద్వాసన పలికేందుకు రెడీ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు.. గురువారం తెలపనుందని సమాచారం. ఈ వంద మందితో పాటు.. టీటీడీలో కీలక సభ్యుడు.. డాలర్ శేషాద్రికి కూడా చెక్ పడినట్టు సమాచారం.
టీటీడీ తీసుకోనున్న సంచలన నిర్ణయమేంటంటే.. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో పనిచేస్తున్న రిటైర్డ్ అధికారులు, సిబ్బందిని తొలగించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్థాయిలో పనిచేస్తోన్న అధికారులను తొలగించాలని.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఇప్పటికే జాబితా సిద్ధం చేసినా.. మరోసారి జాబితాను పరిశీలించే నిమిత్తం ఉత్తర్వులు జారీ చేయకుండా ఆపినట్లు సమాచారం.
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం.. 2019 మార్చి 31కి ముందు పనిచేస్తోన్న రిటైరైన ఉద్యోగులను తొలగించాలన్న నిర్ణయంతో.. డాలర్ శేషాద్రికి కూడా ఉద్వాసన పలకాలని టీటీడీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. డాలర్ శేషాద్రి.. చాలా కాలం నుంచి తిరుమల ఆలయంలో ఓఎస్డీగా కొనసాగుతున్నారు. ఆలయంలో పాటించే అన్ని సంప్రదాయాలు, వ్యవహారాలు.. ఆయనకు బాగా తెలుసు. అలాగే.. తిరుమలకు ఏ ముఖ్యమైన అధికారులు, సెలబ్రెటీలు వచ్చినా.. శేషాద్రి దగ్గరుండి అన్నీ తానై వ్యవహరిస్తారన్నది తెలిసిన విషయమే.
ఏదేమైనా.. ఇప్పుడు టీటీడీలో.. భారీగానే ఖాళీలు కానున్నాయి. మరి ఈ ఖాళీల భర్తీకి అనంతరం ఏ విధమైన చర్యలు చేపడుతారో వేచి చూడాలి. కాగా.. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఏపీలో ప్రభుత్వం మారిన తరువాత జరిగిన నియామకాల్లో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు.