NRI Man: జాలీగా హాలిడేస్‌కు ఇండియాకు వస్తాడు.. పెళ్లి చేసుకుని యూఎస్ చెక్కేస్తాడు.. నిత్యపెళ్లికొడుకు గురించి అసలు విషయం తెలిస్తే.!

అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న సతీష్ బాబు. సెలవుల్లో ఇండియాకు వచ్చి పెళ్ళి చేసుకొని తిరిగి అమెరికా వెళ్ళిపోతున్నాడు. ఇప్పటి వరకూ నాలుగు పెళ్లి చేసుకున్నాడు.. తాజా ఐదో పెళ్ళికి రెడీ అయ్యాడు.

NRI Man: జాలీగా హాలిడేస్‌కు ఇండియాకు వస్తాడు.. పెళ్లి చేసుకుని యూఎస్ చెక్కేస్తాడు.. నిత్యపెళ్లికొడుకు గురించి అసలు విషయం తెలిస్తే.!
Nri Groom Satish
Follow us
Surya Kala

|

Updated on: Jul 28, 2022 | 12:33 PM

Andhra Pradesh: నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ముగ్గురికి విడాకులిచ్చాడు. నాలుగో భార్యతో వివాదం కొనసాగుతుండగానే ఐదో వివాహానికి సిద్దమయ్యాడు. శీతాకాలంలో ఇండియాకి వచ్చి మూడు నెలల మాత్రమే ఇక్కడ ఉండి తర్వాత అమెరికా చెక్కేస్తున్నాడు. ఈ నిత్య పెళ్లికొడుకును ఇండియాకి పిలిపించి కఠిన శిక్ష విధించాలని నాలుగో భార్య చేస్తున్న పోరాటం ఫలించింది. ఐదో భార్య కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు నిత్య పెళ్ళికొడుకు ను అదుపులోకి తీసుకున్నారు. ఈ నిత్యపెళ్లికొడుకు ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.

గుంటూరు జిల్లా క్రోసూరు మండలం అందకూరుకు చెందిన కర్నాటి సతీష్ బాబు గత పదమూడేళ్లుగా యుఎస్ లో సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. పదమూడేళ్ల క్రితం మొదట వైజాగ్ కు చెందిన శైలజను పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరికి పన్నెండు ఏళ్ల వయస్సున్న కూతూరుంది. ఆ తర్వాత శైలజ బంధువైన లావణ్యతో పరిచయం పెంచుకొని అమెరికా వెళ్లాడు. అక్కడ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. దీనిపై మొదటి భార్య శైలజ హైదరాబాద్ లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. శైలజ ఫిర్యాదుతో లావణ్యకు వదిలేసిన సతీష్ బాబు అలియాస్ శ్రీసత్యదేవ్ 2017 నర్సరావుపేట మండలం అన్నవరానికి చెందిన లక్ష్మీని వివాహ చేసుకున్నాడు. మూడు నెలల పాటు ఇండియాలో ఉండి ఆ తర్వాత అమెరికా వెళ్లిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పాస్ పోర్టును స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే లక్ష్మీతో ఒప్పందం చేసుకొని విడాకులు తీసుకున్నాడు. పాస్ పోర్ట్ తీసుకొని అమెరికా వెళ్లాడు. కొన్ని నెలల తర్వాత పాత గుంటూరుకు చెందిన దివ్యను నాలుగో వివాహం చేసుకున్నాడు. మూడు నెలలు ఉన్న తర్వాత చెప్పపెట్టకుండా అమెరికా వెళ్లాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి రావటంతో అసలు విషయం వెలుగు చూసింది. ఇప్పటికే పలు కేసులున్నట్లు పోలీసులు దివ్యకు చెప్పారు.

గత ఏడాది మార్చి 26వ తేదిన కేసు నమోదు చేసిన పోలీసులు సతీష్ తల్లిదండ్రులు వీరభద్రరావు, విజయలక్ష్మీలను, వివాహాలు చేసుకోవటానికి మధ్యవర్తిత్వం వహిస్తున్న చింతాడ బ్రహ్మనందరావులను స్టేషన్ కు పిలిపించి విచారించారు. సతీష్ బాబు అమెరికాలో ఉన్నట్లు చెప్పటంతో కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో ఉండగానే మరొక యువతిని వివాహం చేసుకున్నాడు. శ్యామలా నగర్ కు చెందిన ఐదో భార్య కూడా మోసపోయానని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విజయవాడలో ఉన్న సతీష్ బాబును అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు గుంటూరు దిశ పోలీసులు నిందితుడిని మీడియా ముందు హాజరు పరిచే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

Report: Nagaraju, Tv9 Telugu

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..