Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అప్పలరాజు.. 150 మంది నియోజకవర్గ ప్రజలతో కలిసి దర్శనం..
శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల. స్వామివారిని ఏపీ మంత్రి అప్పలరాజు నేడు దర్శించుకున్నారు. తన నియోజవర్గంలో 150మంది భక్తులతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు.
Tirumala: తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి మంత్రి సీదిరి అప్పలరాజు(Minister Appalaraju) దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం.. మంత్రి తన అనుచరులతో కలిసి భారీగా వెళ్లారు. అయితే దర్శనం కోసం మంత్రి ప్రొటో కాల్ పాటించలేదంటూ వార్తలు వినిపించాయి. దీంతో తనపై వచ్చిన ఆరోపణలపై మంత్రి అప్పలరాజు వివరణ ఇచ్చారు. తాను తన నియోజవర్గ ప్రజలు 150 మందితో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చానని చెప్పారు. స్వామివారి క్షేత్రానికి ఇంతమందితో రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. తాను ఎక్కడా తన అధికారాన్ని దుర్వినియోగం చేయలేదని.. ఒక సామాన్య భక్తిడిలా క్యూ లైన్ లో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నామని చెప్పారు. తిరుమలలో ఎక్కడ కూడా అధికార హోదా ప్రదర్శించలేదని మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..