Andhra Pradesh: గోదావరి ఆర్చ్‌ బ్రిడ్జ్‌పై దూసుకెళ్లనున్న రైళ్లు.. మరోసారి గరిష్ట వేగాన్ని పెంచిన అధికారులు..

Andhra Pradesh: గోదావరి - కొవ్వూరు స్టేషన్ల మధ్య ఉన్న బ్రిడ్జ్‌పై రైళ్ల గరిష్ట వేగాన్ని రైల్వే శాఖ మరోసారి పెంచింది. గోదావర్‌ ఆర్చ్‌ బ్రిడ్జ్‌పై గరిష్ట వేగాన్ని గంటకు 50 కిలోమీర్లకు పెంచింది. 2015 నుంచి ఈ వంతెనపై...

Andhra Pradesh: గోదావరి ఆర్చ్‌ బ్రిడ్జ్‌పై దూసుకెళ్లనున్న రైళ్లు.. మరోసారి గరిష్ట వేగాన్ని పెంచిన అధికారులు..
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 28, 2022 | 12:03 PM

Andhra Pradesh: గోదావరి – కొవ్వూరు స్టేషన్ల మధ్య ఉన్న బ్రిడ్జ్‌పై రైళ్ల గరిష్ట వేగాన్ని రైల్వే శాఖ మరోసారి పెంచింది. గోదావర్‌ ఆర్చ్‌ బ్రిడ్జ్‌పై గరిష్ట వేగాన్ని గంటకు 50 కిలోమీర్లకు పెంచింది. 2015 నుంచి ఈ వంతెనపై రైలు గరిష్ట వేగం గంటకు 30 కిలోమీటర్లుగా ఉండేది. అయితే 2022 ఏప్రిల్‌లో వేగ పరిమితిని గంటలకు 40 కిలోమీటర్లకు పెంచారు. అయితే తాజాగా ఈ వేగ పరిమితి మరోసారి గంటకు 50 కి.మీలకు పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నం వైపు వెళ్లే రైళ్‌లను 2.9 కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెనపై నడుపుతారు.

దేశంలోని దక్షిణాది రాష్ట్రాల నుంచి తూర్పు, ఈశాన్య ప్రాంతానికి ఈ బ్రిడ్జ్‌ వారధిగా పనిచేస్తుంది. ప్రయాణీకుల, సరుకుల రవాణాలో ఇది కీలకంగా మారింది. ఈ బ్రిడ్జ్‌పై వేగాన్ని పెంచేందుకు గాను అధికారులు ఇటీవల పట్టాల కింద ఉండే స్లీపర్లను మార్చి, ట్రాక్‌ను పటిష్టం చేశారు. 50 కి.మీల వేగంతో రైలు ప్రయాణించేందుకు వీలుగా పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే బుధవారం ప్రకటించింది. బ్రిడ్జ్‌పై రైళ్ల వేగాన్ని పెంచడం వల్ల రద్దీ తగ్గడం, రైలు సర్వీసులు నిర్వహన సులువు కావడం, సమయం ఆదా అవుతుందని, బ్రిడ్జ్‌కు సంబంధించిన పనులను అంకిత భావంతో పూర్తి చేసిన సిబ్బందిని ఇంచార్జి జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ అభినందించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..