Sai Priya Missing Case: విశాఖలో అదృశ్యం కేసు మిస్టరీ వీడింది.. దిమ్మదిరిగే షాకిచ్చిన సాయిప్రియ
Sai Priya Missing Case: వైజాగ్‌లో సాయిప్రియ అదృశ్యం వ్యవహారంలో చిక్కుముడి వీడింది. తాను బాగానే ఉన్నానని, తన కోసం ఎక్కడ వెతకవద్దని తల్లికి వాట్సాప్ ద్వారా సందేశం పంపింది..
Sai Priya Missing Case: వైజాగ్‌లో సాయిప్రియ అదృశ్యం వ్యవహారంలో చిక్కుముడి వీడింది. తాను బాగానే ఉన్నానని, తన కోసం ఎక్కడ వెతకవద్దని తల్లికి వాట్సాప్ ద్వారా సందేశం పంపింది. పెళ్లి రోజు భర్త కళ్లుగప్పి ప్రేమించిన వ్యక్తితో పరారైపోయింది సాయిప్రియ. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో సాయంత్రానికే మరో షాకిచ్చింది. విశాఖ నుంచి నేరుగా బెంగళూరుకు ప్రేమించిన వ్యక్తి రవితో కలిసివెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. అంతేకాకుండా తాను రెండో వివాహం చేసుకున్నానని తండ్రికి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసింది.
అయితే భర్తతో కలిసి వచ్చిన సాయిప్రియ వైజాగ్ బిచ్‌లో అదృశ్యం కావడంతో సంచలనంగా మారింది. శ్రీనివాస్ అనే వ్యక్తితో రెండు సంవత్సరాల కిందటనే వివాహం చేసుకుంది. శ్రీనివాస్ హైదరాబాద్‌లోని ఓప్రైవేటు కంపెనీలు జాబ్ చేస్తున్నాడు. ఈనెల 25న సాయిప్రియది పెళ్లి రోజు కావడంతో భర్తతో కలిసి వైజాగ్ బీచ్‌కు వచ్చింది. ఆ తర్వాత తన భర్తకే గట్టి షాకిచ్చిందని పోలీసులు భావిస్తున్నారు.
మొదట భర్తపై అనుమానం..
అయితే విషయంలో పోలీసులు మిస్సింగ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముందుగా భర్తపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు.. తర్వాత అసలు విషయం తెలుసుకున్నారు. సాయిప్రియ ప్లాన్ ప్రకారం భర్తను నమ్మించి ఫ్యూజులు ఔటయ్యేలా షాకిచ్చిందని గుర్తించారు.
నా పెళ్లాయిపోయింది.. వెతకవద్దు..
ప్లాన్ ప్రకారం బీచ్ వెళ్దామని చెప్పి విశాఖ బీచ్‌కు భర్తతో వచ్చిన సాయిప్రియ సడన్ షాకిచ్చింది. తనకు వెళ్లి అయిపోయిందని, నా కోసం ఎవ్వరు కూడా వెతకవద్దని వాయిస్ మెసేజ్ పంపింది. నా ఇష్టంతోనే రవితో కలిసి వచ్చానని తెలిపింది. ఇలా చేసుకున్న భర్తకే షాకివ్వడం సంచలనంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేవ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి