LIC Policy: ఎల్‌ఐసీ నుంచి అద్భుతమైన పాలసీ.. మెచ్యూరిటీ తర్వాత రెట్టింపు డబ్బులు
LIC Jeevan Mangal Policy: భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చాలా మంది జీవిత బీమాను కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరికి బీమా పాలసీలు చేసుకోవడం ఎంతో ముఖ్యం..
LIC Jeevan Mangal Policy: భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చాలా మంది జీవిత బీమాను కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరికి బీమా పాలసీలు చేసుకోవడం ఎంతో ముఖ్యం. కరోనా మహమ్మారి తర్వాత పాలసీలు చేసుకునే వారి సంఖ్య పెరిగినట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ గణంకాలు చెబుతున్నాయి. జీవిత బీమా భవిష్యత్తును సురక్షితంగా ఉంచడమే కాకుండా, ప్రమాదవశాత్తు మరణం సంభవించినప్పుడు కూడా అనేక ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది. చాలా మంది ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని ఎల్‌ఐసీ పాలసీ చేస్తారు. ఎల్‌ఐసీ ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీ కాబట్టి బీమా చేయడం వల్ల నష్టపోయే ప్రమాదం ఉండదు. పూర్తి భద్రత ఉంటుంది. LICలో రకరకాల పాలసీలు అందుబాటులో ఉన్నాయి.
కస్టమర్ల సౌకర్యార్థం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మరో పథకం అందుబాటులో ఉంది. అదే LIC జీవన్ మంగళ్ పాలసీ. LIC జీవన్ మంగళ్ పాలసీ అనేది టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఈ LIC పాలసీ రక్షణతో పాటు ‘ఎండ్ ఆఫ్ టర్మ్ అష్యూర్డ్’ డబ్బును అందిస్తుంది. కస్టమర్ చెల్లించిన మొత్తం ప్రీమియంకు సమానమైన మొత్తం తిరిగి ఇవ్వబడుతుంది. అంటే రెట్టింపు డబ్బులు పొందవచ్చు. అయితే క్రమం తప్పకుండా ప్రీమియంలు చెల్లిస్తూ ఉండాలి.
జీవన్ మంగళ్ పాలసీ ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రమాద ప్రయోజనంతో పాటు రెట్టింపు ప్రయోజనాన్ని అందిస్తుంది. హామీతో పాటు ఈ పథకం ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ పాలసీ ప్రీమియం చెల్లించడానికి 2 నెలలు గ్రేస్ పీరియడ్ కూడా అందుబాటులో ఉందని ఎల్‌ఐసీ చెబుతోంది. ఈ ఎల్‌ఐసీ జీవన్ మంగళ్ పాలసీ పొందే ప్రయోజనం కనిష్టంగా 10,000, గరిష్టంగా 50,000 హామీ ప్రయోజనాలను అందిస్తుంది. ఈ టర్మ్ ప్రీమియంలను ఏటా, ఆర్థి సంవత్సరం, నెలవారీ, 15 రోజులలో, వారం రోజులలో కూడా చెల్లించుకోవచ్చు.
ఈ పాలసీని పొందడానికి వినియోగదారుడి వయస్సు 18 నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. సాధారణ ప్రీమియం ప్లాన్ విషయంలో ఈ పాలసీని 10 నుండి 15 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు. సింగిల్ ప్రీమియం ప్లాన్ విషయంలో పాలసీ కాలవ్యవధి 5 నుండి 10 సంవత్సరాలు. ఈ పాలసీని పొందడానికి కంపెనీ వెబ్‌సైట్‌ను సందర్శించడం, లేదా సమీపంలోని ఏజెంట్‌ను సంప్రదిస్తే పూర్తి వివరాలు తెలియజేస్తారు. లేకపోతే మీ దగ్గరలోని ఎల్‌ఐసీ కార్యాలయానికి వెళ్లినా వివరాలు అందిస్తారు. ఈ పాలసీలో పది సంవత్సరాల పాటు 20వేల సమ్ అష్యూర్డ్ పాలసీని తీసుకున్నట్లయితే మీరు రూ.1,191 వార్షిక ప్రీమియం చెల్లించాలి. ఇంకో విషయం ఏంటంటే జీవన్ మంగళ్ పాలసీలో మీరు పెట్టుబడి పెట్టడం వల్ల మీరు ఆదాయపు పన్ను మినహాయింపు ప్రయోజనం పొందవచ్చు.ఇందులో మీరు ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద మినహాయింపు పొందవచ్చు. దీంతో పాటు మెచ్యూరిటీపై వచ్చే ప్రీమియం మొత్తంపై పన్ను ఉండదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి