Money9: సామాన్యుడికి షాకిస్తున్న పప్పు ధాన్యాలు.. మరోసారి పెరిగిన ధరలు..!
Money9: ప్రస్తుతం పెరుగుతున్న ధరలతో సామాన్యుడిపై తీవ్ర భారం పడుతోంది. పెట్రోల్, డీజి్ ధరలతో పాటు నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు మండిపోతుండటంతో సాధారణ ప్రజల..
Money9: ప్రస్తుతం పెరుగుతున్న ధరలతో సామాన్యుడిపై తీవ్ర భారం పడుతోంది. పెట్రోల్, డీజి్ ధరలతో పాటు నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు మండిపోతుండటంతో సాధారణ ప్రజల నడ్డి విరుగుతున్నట్లయివుతోంది. సంపదన పెద్దగా పెరగకపోయినా.. ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. దీంతో లబోదిబోమంటున్నారు. ఇప్పుడు పప్పు ధాన్యాలు పెరగడం షాక్‌కు గురి చేస్తోంది. జూలైలో దేశంలోని చాలా నగరాల్లో పప్పు ధాన్యాలు భారీగా పెరిగాయి. భారత్ లో పప్పుధాన్యాల ఉత్పత్తి బాగానే ఉన్నా… దిగుమతులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. 2021-22 సంవత్సరంలో మొత్తం 27.75 లక్షల టన్నుల పప్పుధాన్యాలు ఉత్పత్తి చేయబడ్డాయి. అయితే 2020-21లో చేసిన ఉత్పత్తి కంటే 2021-22లో జరిగిన ఉత్పత్తి 2.3 మిలియన్ టన్నులు ఎక్కువ.
ఖరీఫ్ సీజన్‌లో కనీస మద్దతు ధర పెరగడంతో పప్పు ధాన్యాల ఉత్పత్తికి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇప్పుడు కంది పప్పు 4 నుంచి 12 శాతం పెరుగగా, మినపప్పు 3 నుంచి 13 శాతం పెరిగింది. ఇలా పప్పుల ధరలు పెరుగుతుండటంతో సామాన్యుడికి మరింత భారీ పెరిగిపోతోంది. అయితే విదేశాల నుంచి పప్పు ధాన్యాల దిగుమతులు తక్కువగా ఉన్నప్పటికీ.. దేశంలో పంట దిగుబడి ఎక్కవగానే ఉంది. అయితే దేశంలో పప్పు ధాన్యాల అవసరాలు సరిపోతున్నాయి. అయినా వీటి ధరలు మరింత పెరగడం గమనార్హం. ఇలా దేశంలో పప్పు ధరలతో పాటు అన్నింటా ధరలు పెరిగిపోతున్నాయి. దీని కారణంగా సామాన్య ప్రజలు కొనలేని పరిస్థితి నెలకొంటుంది.
బిజినెస్, స్టాక్ మార్కెట్ మరెన్నో విషయాల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి Money9 యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా Money9 యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఆస్తి, పన్నులు, ఆర్థిక విధానాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాలను పలు భాషల్లో సులభంగా తెలుసుకోవచ్చు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి