Google Maps: హైదరాబాదీలు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ కోసం సిద్ధమవ్వండి.. గూగుల్‌ మ్యాప్స్‌లో స్ట్రీట్‌ వ్యూ ఫీచర్‌ వచ్చేస్తోంది..

Google Maps: ఒకప్పుడు ఏదైనా అడ్రస్‌ తెలియాలంటే పక్కన వారిని అడిగి తెలుసుకునే వారు. కానీ ఏమంటూ గూగుల్‌ మ్యాప్స్‌ అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుంచి సీన్‌ మారింది. ఎవరి అవసరం లేకుండా...

Google Maps: హైదరాబాదీలు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ కోసం సిద్ధమవ్వండి.. గూగుల్‌ మ్యాప్స్‌లో స్ట్రీట్‌ వ్యూ ఫీచర్‌ వచ్చేస్తోంది..
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 28, 2022 | 6:47 AM

Google Maps: ఒకప్పుడు ఏదైనా అడ్రస్‌ తెలియాలంటే పక్కన వారిని అడిగి తెలుసుకునే వారు. కానీ ఏమంటూ గూగుల్‌ మ్యాప్స్‌ అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుంచి సీన్‌ మారింది. ఎవరి అవసరం లేకుండా చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు ఏ చిరునామానైనా సింపుల్‌గా తెలుసుకోవచ్చు. మ్యాప్స్‌ ఆన్‌ చేసుకొని ఎక్కడికైనా వెళ్లిపోవచ్చు. ఇక మ్యాప్స్‌లో ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లను అట్రాక్ట్‌ చేస్తోంది గూగుల్‌. ఈ క్రమంలో అందుబాటులోకి వచ్చిందే స్ట్రీట్‌ వ్యూ. ఈ ఫీచర్‌ సహాయంతో ఏ ప్రాంతాన్నయినా రియస్టిక్‌గా చూడొచ్చు. అయితే ఇప్పటి వరకు ఈ ఫీచర్‌ కేవలం విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ తాజాగా గూగుల్‌ ఈ ఫీచర్‌ను భారత్‌లోనూ పరిచయం చేసింది.

త్వరలోనే ఈ ఫీచర్‌ను హైదరాబాద్‌తో పాటు దేశంలోని మరో 8 నగరాల్లో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్‌ సహాయంతో ఏ ప్రాంతాన్నైనా రియలస్టిగ్‌ చూడవచ్చు. మీ లొకేషన్‌కు సమీపంలో ఉన్న ల్యాండ్ మార్క్‌లను సులభంగా గుర్తింవచ్చు. గూగుల్‌ ఈ సేవలను భారత్‌లోని జెనెసిస్‌ ఇంటర్నేషనల్‌, ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహీంద్రా సహకారంతో తీసుకొస్తోంది. గూగుల్ ఈ సేవలను తొలుత బెంగళూరులో జులై 27న లాంచ్‌ చేసింది. బెంగళూరు తర్వాత ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చేది హైదరాబాద్‌లోనే. వీటితో పాటు భారత్‌లో కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, ముంబై, పుణె, నాసిక్, వడోదరా, అహ్మద్‌నగర్, అమృత్‌సర్ నగరాల్లో ఈ ఫీచర్‌ను తీసుకొస్తున్నారు.

స్ట్రీట్‌ వ్యూను ఉపయోగించుకోవడం కోసం మొదట గూగుల్ మ్యాప్స్‌ యాప్‌లోకి వెళ్లి లోకేషన్ పేరును టైప్ చేసి.. సెర్చ్ చేయాలి. ఆ తర్వాత స్క్రీన్ కింది భాగంలో స్ట్రీట్ వ్యూ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేయాలి. అప్పుడు స్ట్రీట్ వ్యూలో ఆ ప్రాంతం మొత్తం కనిపిస్తుంది. లేకపోతే మ్యాప్‌పై కనిపించే లేయర్స్ సింబల్‌పై ట్యాప్ చేసి కూడా స్ట్రీట్ వ్యూను ఎనేబుల్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..