Instagram Reels: ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో మరో రెండు కొత్త ఫీచర్లు.. వీటిని ఎలా వాడాలో తెలుసా.?
Instagram: ఫేస్‌బుక్ తర్వాత ఆ స్థాయిలో ప్రాచుర్యం పొందిన సోషల్ మీడియా యాప్స్‌లో ఇన్‌స్టాగ్రామ్ నిలిచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా యువతను ఈ యాప్ ఎక్కువగా...
Instagram Reels: ఫేస్‌బుక్ తర్వాత ఆ స్థాయిలో ప్రాచుర్యం పొందిన సోషల్ మీడియా యాప్స్‌లో ఇన్‌స్టాగ్రామ్ నిలిచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా యువతను ఈ యాప్ ఎక్కువగా ఆకట్టుకుంది. టిక్‌టాక్‌పై నిషేధం విధించిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లోని రీల్స్ ఫీచర్‌కు ఎక్కడలేని క్రేజ్ లభించిందనే విషయం తెలిసిందే. అత్యంత తక్కువ సమయంలో ఈ ఫీచర్‌కు ఆదరణ లభించింది. ఇక యూజర్లను మరింత పెంచుకునే క్రమంలో ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టా రీల్స్‌లో కొత్తగా మరో రెండు ఫీచర్లను తీసుకొస్తున్నారు.
వీటిలో మొదటిది ఇన్‌స్టాగ్రామ్ డ్యూయల్.. ఈ ఫీచర్‌తో ఒకేసారి రెండు రకాల వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు. అంటే బ్యాక్ కెమెరాతో వీడియోను రికార్డ్ చేస్తూనే మరోవైపు సెల్ఫీ కెమెరాతో మరో వీడియోను తీసుకోవచ్చు. రెయిర్ కెమెరాతో రికార్డ్ చేసిన వీడియో పెద్ద స్క్రీన్‌లో, సెల్ఫీ కెమెరాతో రికార్డ్ చేసిన వీడియో చిన్న స్క్రీన్‌లో కనిపిస్తుంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలంటే.. మొదట ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం ఎడమవైపు కనిపించే ఆప్షన్స్‌లో డ్యూయల్ అనే లేబుల్‌తో ఉన్న కెమెరా ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. దీంతో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు.
ఇక ఇన్‌స్టాగ్రామ్ తీసుకొస్తున్న మరో ఫీచర్.. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ టెంప్లెట్స్. ఈ ఫీచర్ సహాయంతో ఇతరులు చేసిన రీల్‌ను మీరు చేయొచ్చు. ఉదారహణకు ఒక యూజర్ చేసిన రీల్స్ వీడియో మీకు నచ్చిందనుకోండి. మీకూ అలాంటి వీడియోనే చేయాలనిపిస్తే.. సదరు రీల్ చూస్తూ స్క్రీన్ మీద కనిపించే కెమెరా సింబల్‌పై క్లిక్ చేయాలి. దీంతో రీల్‌కు ఉన్న మ్యూజిక్, ఎఫెక్ట్స్‌తో మీ సొంత వీడియో కానీ ఫొటోలను కానీ యాడ్ చేస్తే సరిపోతుంది. సదరు రీల్‌లో ఉన్న అన్ని ఎఫెక్ట్స్‌ను ఉపయోగించకుండా ఈ ఫీచర్‌తో రీల్స్‌ను సింపుల్‌గా చేసేయొచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..