Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. తల్లి కాలేక పోతున్నానని తనువు చాలించిన మహిళ..
Hyderabad: చిన్న చిన్న సమస్యలకే తనువు చాలిస్తున్నారు కొందరు. సమస్యను ఎక్కువగా ఊహించుకుంటూ తమను తాము హింసించుకోవడమే కాకుండా కుటుంబాల్లోనూ తీవ్ర విషాధాన్ని నింపుతున్నారు. తాజాగా..
Hyderabad: చిన్న చిన్న సమస్యలకే తనువు చాలిస్తున్నారు కొందరు. సమస్యను ఎక్కువగా ఊహించుకుంటూ తమను తాము హింసించుకోవడమే కాకుండా కుటుంబాల్లోనూ తీవ్ర విషాధాన్ని నింపుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరగిన ఓ సంఘటన స్థానికంగా దిగ్ర్భాంతిని కలిగించింది. వివరాల్లోకి వెళితే.. బిహార్‌కు చెందిన రామ్ మెహతో, ఆశ ఇద్దరు హైదరాబాద్‌లోని కుతుబుల్లాపూర్ మండలానికి చెందిన పంచశీల కాలనీలో నివాసం ఉంటున్నారు.
వీరిద్దరికి ఏడాది క్రితం వివాహం జరిగింది. రామ్ మెహతో స్థానికంగా తాపీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే పనిలో భాగంగా రామ్ మెహతో బుధవారం కూలి పనికి వెళ్లాడు. మధ్యాహ్నం భోజనానికి రాగా.. ఆశ డోర్ తెరవలేదు. దీంతో ఇంట్లో గమనించగా ఆశ అప్పటికే ఫ్యాన్ హుక్కుకి చున్నీతో ఉరి వేసుకొని కనిపించింది. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. వివాహం జరిగి ఏడాది దాటుతున్నా సంతానం కలగడం లేదని ఆశ, ఇరుగు పొరుగు వారికి చెప్పుకుంటూ బాధపడేదని తెలుస్తోంది.
ఈ కారణంగానే మానసికంగా కృంగి పోయిన ఆశ.. బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ వార్త స్థానికంగా తీవ్ర విషాధాన్ని నింపింది. ఎక్కడో నుంచో బతకాడికి వచ్చి ఇక్కడ ప్రాణాలు తీసుకోవడం ఏంటని స్థానికులు అనుకుంటున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..