AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada: ప్లాట్ ఫామ్ టికెట్ ధరలు భారీగా పెంపు.. రద్దీని నివారించేందుకు ప్రత్యేక చర్యలు

మీ సన్నిహితులు, బంధువులు పండుగకు ఊరెళ్తున్నారా.. వాళ్లకు సెండాఫ్ చెప్పడానికి వారితో పాటు రైల్వే స్టేషన్ కు వెళ్తున్నారా.. ఆగండాగండి.. ప్లాట్ ఫామ్ టికెట్ తీసుకుంటున్నారా మరి. ఆ..ఏముందిలే పది రూపాయలే..

Vijayawada: ప్లాట్ ఫామ్ టికెట్ ధరలు భారీగా పెంపు.. రద్దీని నివారించేందుకు ప్రత్యేక చర్యలు
Vijayawada
Ganesh Mudavath
|

Updated on: Sep 30, 2022 | 9:42 AM

Share

మీ సన్నిహితులు, బంధువులు పండుగకు ఊరెళ్తున్నారా.. వాళ్లకు సెండాఫ్ చెప్పడానికి వారితో పాటు రైల్వే స్టేషన్ కు వెళ్తున్నారా.. ఆగండాగండి.. ప్లాట్ ఫామ్ టికెట్ తీసుకుంటున్నారా మరి. ఆ..ఏముందిలే పది రూపాయలే కదా అనుకుంటున్నారా. అయితే మీరు పొరపడినట్లే. రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫాం టికెట్ ధర భారీగా పెరిగింది. రైల్వే ప్రయాణీకులపై దక్షిణ మధ్య రైల్వే బాదుడు కొనసాగుతోంది. ఇప్పటికే ప్రత్యేక రైళ్లలో ఛార్జీల పెంపుతో ఆర్థికంగా కుదేలవుతున్న ప్రయాణీకులపై ప్లాట్ ఫామ్ టికెట్ రూపంలో అదనపు ఛార్జీలు మోపింది. ప్లాట్ ఫామ్ టికెట్ ధరను రూ.10 నుంచి రూ.30కు పెంచుతూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. దసరా సందర్భంగా ఏర్పడే అనవసర రద్దీని నివారించేందుకు రైల్వే శాఖ ప్లాట్​ ఫాం టికెట్ ధరలను పెంచింది. ఈ పెంపు శుక్రవారం నుంచి అక్టోబర్ 9 వరకు అమలులో ఉంటుంది. విజయవాడ రైల్వే స్టేషన్​లో గతంలో రూ.10 ఉంటే ప్రస్తుతం రూ.30కి పెంచారు. గుంటూరులో 10 రూపాయల నుంచి 20కి పెంచారు. సొంత ఊర్లకు వెళ్లే వాళ్లకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు.. ప్లాట్​ ఫాంపైన రద్దీని నియంత్రించేందుకు ఈ ధరలు పెంచినట్లు అధికారులు తెలిపారు.

కాగా.. తెలంగాణలోని కాచిగూడ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం టికెట్ ధరలను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. పెంచిన ధరలు అక్టోబర్ 9 వరకు అమలులోకి ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు దసరా సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు ఊరట కలిగించింది. ప్రతి ఏటా ప్రత్యేక బస్సుల్లో పెంచే ఛార్జీలను ఈ ఏడాది పెంచడం లేదని వెల్లడించింది. ప్రయాణీకులు ఆర్టీసీ బస్సు సర్వీసులను ఉపయోగించుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో కోరారు. దసరా పండగ కోసం పట్నం పల్లెబాట పట్టింది. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు సొంతూళ్లకు వెళ్తున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది.

సికింద్రాబాద్, తిరుపతి, యశ్వంత్ పూర్ నగరాలకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లే 02764 ట్రెయిన్‌.. నెంబర్‌గల రైలు 09.00 గంటలకు బయలు దేరి, తర్వాతి రోజు 09.00 గంటలకు చేరుకుంటుంది. తిరుపతి నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే 02763 నెంబర్‌ రైలు 17.00 గంటలకు బయలు దేరి తర్వాతి రోజు 05.45 గంటలకు గమ్యాన్ని చేరుకుంటుంది. సికింద్రాబాద్‌- తిరుపతి – సికింద్రాబాద్‌ రైలు జనగామ, కాజిపేట్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, డోర్నకల్‌, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడురు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.

ఇవి కూడా చదవండి

ఇక సికింద్రాబాద్‌– యశ్వంత్‌పూర – సికింద్రాబాద్‌ రైలు కాచిగూడ, ఉందానగర్‌, షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌ నగర్‌, వనపర్తి, గద్వాల్‌, కర్నూలు, డోన్‌, అనంతపురం, ధర్మవరం, హిందూపురం, యెలహంక స్టేషన్స్‌లో ఆగుతుంది.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం