AP Govt Jobs 2022: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. నెలకు రూ.147760ల జీతం..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆయుష్‌ విభాగంలో.. 72 మెడికల్‌ ఆఫీసర్‌ (ఆయుర్వేద, ఆయుష్‌) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

AP Govt Jobs 2022: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. నెలకు రూ.147760ల జీతం..
​APPSC Medical Officer (Ayurveda) Recruitment 2022
Follow us

|

Updated on: Sep 30, 2022 | 10:08 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆయుష్‌ విభాగంలో.. 72 మెడికల్‌ ఆఫీసర్‌ (ఆయుర్వేద, ఆయుష్‌) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఆయుర్వేదం విభాగంలో డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే మెడికల్‌ ప్రాక్టీషనర్‌గా రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఉండాలి. జులై 1, 2022వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు వర్తిస్తుంది.

ఈ అర్హతలు కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 21, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్‌ 6, 2022వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.370లు, ఎస్సీ/ఎస్టీ/బీసీ/పీహెచ్‌/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులు రూ.250లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపులు అక్టోబర్‌ 20వ తేదీలోపు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష నవంబర్‌ నెలలో ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.57,100ల నుంచి రూ.1,47,760ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

రాత పరీక్ష విధానం: రాత పరీక్ష మొత్తం 2 పేపర్లకు నిర్వహిస్తారు. మొదటి పేపర్‌లో జనవర్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ విభాగంలో 150 మార్కులకు, 150 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు, 150 నిముషాల వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. రెండో పేపర్ సంబంధిత సబ్జెక్టులో నిర్వహిస్తారు. ఈ పేపర్‌ 150 ప్రశ్నలకు 300 మార్కులకు ఉంటుంది. పరీక్ష 150 నిముషాల్లో రాయవల్సి ఉంటుంది. రాత పరీక్ష ఇంగ్లిష్‌ మాద్యమంలో మాత్రమే ఉంటుంది. ఈ విధంగా మొత్తం 450 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.