Watch Video: ‘కూటమి మేనిఫెస్టోలో మోదీ, పవన్ ఫోటోలు మాయం’.. మాజీమంత్రి పేర్ని నాని

కూటమి మేనిఫెస్టోలో మోదీ ఫోటో మాయమైందని పేర్ని నాని చంద్రబాబుకు కౌంటర్ వేశారు. మచిలీపట్నంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేయాలని కూటమి నేతలు చూస్తున్నారన్నారు. బీజేపీతో తాను కలిశానంటే ఐదు కోట్ల ప్రజల శ్రేయస్సు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసమేనని చంద్రబాబు చెప్పడంపై మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ వేశారు.

Watch Video: 'కూటమి మేనిఫెస్టోలో మోదీ, పవన్ ఫోటోలు మాయం'.. మాజీమంత్రి పేర్ని నాని
Perni Nani
Follow us

|

Updated on: May 02, 2024 | 6:44 PM

కూటమి మేనిఫెస్టోలో మోదీ ఫోటో మాయమైందని పేర్ని నాని చంద్రబాబుకు కౌంటర్ వేశారు. మచిలీపట్నంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేయాలని కూటమి నేతలు చూస్తున్నారన్నారు. బీజేపీతో తాను కలిశానంటే ఐదు కోట్ల ప్రజల శ్రేయస్సు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసమేనని చంద్రబాబు చెప్పడంపై మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ వేశారు. మొన్నటి వరకు ముగ్గురు ఫోటోలతో ప్రచారం చేసిన చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేసే సమయానికి కేవలం పవన్, చంద్రబాబు ఫోటోలు మాత్రమే ఉన్నాయని ఎద్దేవా చేశారు. కూటమి నేతలు మేనిఫెస్టో పేరుతో మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.

చంద్రబాబు, పవన్ కూటమి మేనిఫెస్టోకు బీజేపీ మద్దతు లేదన్నారు. గతంలో 2019 ఎన్నికల్లో మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలతో కూడిన మేనిఫెస్టోతో ఇంటింటికీ ప్రచారం చేశారన్నారు. ఆ మేనిఫెస్టో కాగితంపై చంద్రబాబు సంతకం కూడా చేశారన్నారు. తాజాగా కూటమి మేనిఫెస్టో గురించి సూపర్ 6 పేరుతో ఇచ్చిన ఒక పత్రిక ప్రకటనలో పవన్ కళ్యాణ్ ఫోటో కూడా మాయమైందని కౌంటర్ వేశారు. ఎన్నికలు దగ్గరకు వచ్చాక కూటమి మేనిఫెస్టోలో పవన్ ఫోటో కూడా మాయమైందని కేవలం చంద్రబాబు ఫోటో ఒక్కటే ఉందని సెటైర్లు వేశారు. గతంలో సూపర్ 6లో పెన్షన్ రూ. 4 వేలు ఇస్తామని చెప్పి తాజాగా ఆ పథకాన్ని సూపర్ 6 నుంచి ఎక్కడా కనపడకుండా చేశారన్నారు. వీటికి ఆధారంగా నిత్యం అచ్చయ్యే వార్తాపత్రికలను చూపించారు అయన. ఇలా ఫోటోలతో పాటు పథకాలు కూడా మాయమవుతున్నాయని వ్యంగాస్త్రాలు సంధించారు మాజీ మంత్రి పేర్ని నాని.

పేర్ని నాని పూర్తి వీడియో..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…