AP Weather: అబ్బ.. ఎంత చల్లటి వార్త.. ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. సూర్యడు చెలరేగిపోతున్నాడు. మే మొదలవ్వడంతో ఉష్ణోగ్రతలు.. 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వెదర్ డిపార్ట్‌మెంట్ కూల్ న్యూస్ చెప్పింది. పలు ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు పడతాయని వెల్లడించింది. ఏపీ లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో...
దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ & రాయలసీమ మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది. ఈ క్రమంలో రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
————————————
గురువారం, శుక్రవారం, శనివారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది వడ గాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్లు వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
——————————–
గురువారం, శుక్రవారం :- వాతావరణం పొడి గా ఉండే అవకాశం ఉంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.
శనివారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. వడ గాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్లు వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.
రాయలసీమ :-
——————-
గురువారం :- వాతావరణం పొడి గా ఉండే అవకాశం ఉంది. వడ గాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది . వేడి రాత్రులు ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడవచ్చును.
శుక్రవారం ;- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. వడ గాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది. వేడి రాత్రులు ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడవచ్చును. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్లు వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.
శనివారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. వడ గాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది .ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్లు వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.
కాగా తిరుపతిలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం నుంచి వాతావరణం కొంచెం చల్లగా ఉండగా.. అరగంట పాటు వర్షం పడింది. నిన్నటి వరకు భగభగలాడిన సూర్యుడితో.. ఉక్కబోతతో అల్లాడిన తిరుమల క్షేత్రం చల్లగా మారిపోయింది. చల్లటి గాలులతో భక్తులు కూల్ అయ్యారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…