‘చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలే’.. కూటమి మేనిఫెస్టోపై సజ్జల కౌంటర్..

ఏపీ ఎన్నికల్లో భాగంగా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదల చేసింది. అందులో సీఎం జగన్ చేయగలిగినవి మాత్రమే చెప్పారన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన టీడీపీ కూటమి మేనిఫెస్టోపై మండిపడ్డారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలే అని విమర్శించారు. పేదల జీవితాల్లో మంచి మార్పు రావాలని కోరుకున్నారు సీఎం జగన్ అని చెప్పారు. బాబు కూటమిలోని హామీలన్నీ అమలు కానివేనని ఆరోపించారు. చంద్రబాబు చెప్పేవలన్నీ అబద్దాలే అని ప్రజలకు బాగా తెలుసన్నారు.

'చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలే'.. కూటమి మేనిఫెస్టోపై సజ్జల కౌంటర్..
Sajjala Rama Krishna Reddy
Follow us

|

Updated on: May 02, 2024 | 3:30 PM

ఏపీ ఎన్నికల్లో భాగంగా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదల చేసింది. అందులో సీఎం జగన్ చేయగలిగినవి మాత్రమే చెప్పారన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన టీడీపీ కూటమి మేనిఫెస్టోపై మండిపడ్డారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలే అని విమర్శించారు. పేదల జీవితాల్లో మంచి మార్పు రావాలని కోరుకున్నారు సీఎం జగన్ అని చెప్పారు. బాబు కూటమిలోని హామీలన్నీ అమలు కానివేనని ఆరోపించారు. చంద్రబాబు చెప్పేవలన్నీ అబద్దాలే అని ప్రజలకు బాగా తెలుసన్నారు. కోవిడ్ సంక్షోభం సమయంలో కూడా సంక్షేమం ఎక్కడా బ్రేక్ వేయకుండా అమలు చేశామన్నారు. అభివృద్ది కూడా ఎక్కడా ఆపలేదన్నారు. కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చినట్లు వివరించారు.

పెన్షన్లను రూ. 1000 నుంచి రూ. 3000 వేలకు తీసుకొచ్చామన్నారు. తాము ఇస్తున్న పథకాలకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారని టీడీపీ వాళ్లు ప్రశ్నించారన్నారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి సంపూర్ణంగా అమలు చేయలేదన్నారు. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన సున్నవడ్డీ రుణాలు ఎక్కడా ఇవ్వలేదన్నారు. ఇప్పుడు కూటమి ఇచ్చిన హామీలు కూడా అమలు చేసేందుకు సాధ్యం కానివే అన్నారు. సూపర్ 6 అని చెబుతున్న హామీలకు అర్హత ఏంటో కూడా ఇప్పటి వరకు ఎక్కడా చెప్పలేదన్నారు. నిరుద్యోగభృతి అని చంద్రబాబు అంటున్నారు.. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికీ ఇస్తారా.. ఇవ్వరా అని ప్రశ్నించారు. గతంలోనూ రైతుల రుణమాఫీ, సున్నా వడ్డీ రుణాలు అన్నారు. ఏవీ అమలు కాలేదన్నారు. పథకాలన్నీ వడపోస్తూ ఏ ఒక్కరికీ అందజేయలేదన్నారు.

ఇవి కూడా చదవండి

2014తో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చే సరికి హడావిడిగా హామీలు ఇవ్వడం, అమలు చేయకపోవడం చంద్రబాబుకు అలవాటు అని విమర్శించారు. హామీలు ఇవ్వడం వాటిని అమలు చేయకపోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని చురకలు అంటించారు సజ్జల రామకృష్ణా రెడ్డి. 1999లో ఇచ్చిన హామీలను కూడా చంద్రబాబు అమలు చేయలేదన్నారు.  వెసులు బాటు ఉంటే సీఎం జగన్ మరిన్ని పథకాలు అందుబాటులోకి తెస్తారు. పేదల అభ్యుతి కోసం సీఎం జగన్ ఎప్పుడూ వెనుకాడరని స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకుని మరింత ఆదాయం వస్తే మరిన్ని హామీలను అమలు చేస్తామన్నారు. రైతులు, పేదల ఎదుగుదలకు సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని చెప్పారు.

చంద్రబాబు తన మనుషులు నిమ్మగడ్డ రమేష్ తదితరులు కలిసి చేసిన పని వల్ల పెన్షనర్లు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ఇంటింటికి అందే పెన‌్షన్ అందకుండా చేశారని విమర్శించారు. ఈసీకి ఫిర్యాదు చేయడం వల్లే వాలంటీర్ వ్యవస్థ ఆగిపోయిందని వివరించారు. సాఫీగా సాగిపోతున్న వ్యవస్థపై అటంకాలు సృష్టించారన్నారు. ఇప్పుడు మళ్లీ ఓట్ల కోసం అవ్వా,తాతల పెన్షన్ రూ. 4 వేలు చేస్తానని అబద్దపు హామీలు ఇస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి రావాలనుకుంటే ఏ పార్టీ కూడా ఇలాంటి పనులు చేస్తుందా అని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే మళ్ళీ చీకటి రోజులు ప్రారంభమవుతాయని సజ్జల హెచ్చరించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సీఎం జగన్ సంక్షేమం అందించారన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
చేతికి కట్టుతోనే కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య రాయ్.. ఫ్యాన్స్ ఫిదా
చేతికి కట్టుతోనే కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య రాయ్.. ఫ్యాన్స్ ఫిదా
తెలుగు రాష్ట్రాలకు కుండబోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాలకు కుండబోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. కారణం ఇదే
నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. కారణం ఇదే
మారిన టీమిండియా షెడ్యూల్.. ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్..
మారిన టీమిండియా షెడ్యూల్.. ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్..
ఐశ్వర్య నువ్వు సూపర్.. చేతికి గాయమైన లెక్క చేయకుండా..
ఐశ్వర్య నువ్వు సూపర్.. చేతికి గాయమైన లెక్క చేయకుండా..
సమ్మర్‌లో వైజాగ్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? మీకోసమే..
సమ్మర్‌లో వైజాగ్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? మీకోసమే..
ముంబైతో పోరుకు లక్నో రెడీ.. రోహిత్‌పైనే చూపులన్నీ..
ముంబైతో పోరుకు లక్నో రెడీ.. రోహిత్‌పైనే చూపులన్నీ..
తెలంగాణ మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ 2024 ప్రవేశాలు
తెలంగాణ మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ 2024 ప్రవేశాలు
నేడు ముంబై, లక్నోల నామమాత్రపు పోరు.. సచిన్ తనయుడి ఎంట్రీ
నేడు ముంబై, లక్నోల నామమాత్రపు పోరు.. సచిన్ తనయుడి ఎంట్రీ
ఈ వీకెండ్‌లో ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ సినిమాలు.. ఫుల్ లిస్ట్ ఇదిగో
ఈ వీకెండ్‌లో ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ సినిమాలు.. ఫుల్ లిస్ట్ ఇదిగో