Lok Sabha Election: వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు.. ఓట్లు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వీల్ చైర్లు

సార్వత్రిక ఎన్నికలకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. మే13 తేదీన జరగనున్న పోలింగ్‌కు ఇంకా కొద్ది రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. దీంతో అధికార యంత్రాంగం పోలింగ్ ఏర్పాట్లలో తలమునకలైంది. శ్రీకాకుళం జిల్లాలో పోలింగ్ కేంద్రాల ఎంపిక ఇప్పటికే పూర్తి కాగా, సజావుగా పోలింగ్ జరిపేందుకు, ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లకు తగిన ఏర్పాట్లు కల్పించటంలో నిమగ్నమైంది జిల్లా యంత్రాంగం.

Lok Sabha Election: వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు.. ఓట్లు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వీల్ చైర్లు
Election Arrangements
Follow us
S Srinivasa Rao

| Edited By: Balaraju Goud

Updated on: May 02, 2024 | 12:48 PM

సార్వత్రిక ఎన్నికలకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. మే13 తేదీన జరగనున్న పోలింగ్‌కు ఇంకా కొద్ది రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. దీంతో అధికార యంత్రాంగం పోలింగ్ ఏర్పాట్లలో తలమునకలైంది. శ్రీకాకుళం జిల్లాలో పోలింగ్ కేంద్రాల ఎంపిక ఇప్పటికే పూర్తి కాగా, సజావుగా పోలింగ్ జరిపేందుకు, ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లకు తగిన ఏర్పాట్లు కల్పించటంలో నిమగ్నమైంది జిల్లా యంత్రాంగం. అందులో భాగంగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చే వృద్ధులు, వికలాంగ ఓటర్లను దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ముఖ్యంగా వికలాంగులు, వృద్దులు ఓట్లు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలో భాగంగా వీల్ చైర్లు అందుబాటులోకి తెస్తూన్నారు.

గురువారం శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. మనజీర్ జిలానీ సమూన్ అధ్యక్షతన నియోజకవర్గాల వారీగా వీల్ చైర్ లను, మాగ్నిఫయింగ్ (భూతద్దాలు) ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. జిల్లాలోని శ్రీకాకుళం పార్లమెంట్‌తోపాటు మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఇందులో భాగంగా 1700 వీల్ చైర్లు, కంటి చూపు తక్కువ ఉన్నవారికి మాగ్నిఫయింగ్ (భూతద్దాలు) 1700 కేటాయించారు. వాటిని శ్రీకాకుళం జిల్లా ఎన్నికల అధికారి డా. మనజీర్ జిలానీ సమూన్ పరిశీలించి సంబంధిత నియోజక వర్గాలకు పంపేందుకు చర్యలు చేపట్టారు.

ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీల్ చైర్లు, మాగ్నిఫయింగ్ (భూతద్దాలు) పంపించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి డా. మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసే ఈ సదుపాయాన్ని అవసరమున్న ఓటర్లు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…