Vande Bharat: గుడ్ న్యూస్.! ఏపీకి మరో వందేభారత్.. ఈసారి ఆ ప్రాంతం ప్రజలకు పండగే..

తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ రైళ్లకు ప్రజాదరణ భారీగా పెరిగింది. ప్రస్తుతం సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడుస్తోన్న రెండు వందేభారత్ రైళ్లు, అలాగే విజయవాడ-చెన్నై, విశాఖపట్నం-భువనేశ్వర్, సికింద్రాబాద్-తిరుపతి.. ఇప్పుడు మరో వందేభారత్ రైలు ఏపీకి రాబోతోంది. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Vande Bharat: గుడ్ న్యూస్.! ఏపీకి మరో వందేభారత్.. ఈసారి ఆ ప్రాంతం ప్రజలకు పండగే..
Vande Bharat Metro
Follow us
Ravi Kiran

|

Updated on: May 02, 2024 | 11:58 AM

తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ రైళ్లకు ప్రజాదరణ భారీగా పెరిగింది. ప్రస్తుతం సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడుస్తోన్న రెండు వందేభారత్ రైళ్లు, అలాగే విజయవాడ-చెన్నై, విశాఖపట్నం-భువనేశ్వర్, సికింద్రాబాద్-తిరుపతి, కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ రైళ్లు ఫుల్ ఆక్యుపెన్సీతో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే వందేభారత్ స్లీపర్ రైళ్లతో పాటు వందేభారత్ మెట్రో రైళ్లను కూడా త్వరలోనే ప్రవేశపెట్టబోతున్నట్టు కేంద్రం తెలిపింది. వచ్చే జూలై నుంచి వందేమెట్రో రైళ్లు పట్టాలెక్కనుండగా.. ఏపీకి కూడా ఒకటి కేటాయిస్తున్నట్టు సమాచారం.

తిరుపతి నుంచి చెన్నై మధ్య ఈ వందేభారత్ మెట్రో రైలు పరుగులు పెట్టనున్నట్టు తెలుస్తోంది. జూలై నెలలో ట్రయిల్ రన్ చేపట్టనుండగా.. రెండు వారాల ట్రయిల్ రన్ అనంతరం.. చెన్నై-తిరుపతి వందేమెట్రో పూర్తిస్థాయిలో నడవనుంది. 100 నుంచి 250 కిలోమీటర్ల దూరం ఉన్న నగరాల మధ్య ఈ వందేభారత్ మెట్రో సర్వీసులను ప్రవేశపెట్టనుంది కేంద్ర రైల్వేశాఖ. గరిష్టంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైళ్లకు కనీసం 12 బోగీలు ఉండనున్నాయి. తొలిదశలో 50 వందేభారత్ మెట్రో రైళ్లు దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి.