Andhra Pradesh: పంచ పాండవుల్లా ఉద్యమ పిడికిలి బిగించిన ఆ ఐదు గ్రామాలు.. ఎందుకో తెలుసా?
Andha Pradesh vs Telangana: మరో అస్తిత్వ పోరాటం.. ఐదు గ్రామాల ఆత్మగౌరవ నినాదం.. ఇన్నాళ్లు ఒక లెక్కా.. ఇప్పటి నుంచి మరో లెక్క. ఇక పంచ సంగ్రామేనంటూ..
Andha Pradesh vs Telangana: మరో అస్తిత్వ పోరాటం.. ఐదు గ్రామాల ఆత్మగౌరవ నినాదం.. ఇన్నాళ్లు ఒక లెక్కా.. ఇప్పటి నుంచి మరో లెక్క. ఇక పంచ సంగ్రామేనంటూ పంచ పాండవుల్లా ఉద్యమ పిడికిలి బిగించాయి ఆ ఐదు గ్రామాలు. ఆత్మానుబంధం ఓ చోట.. సరిహద్దు బంధం మరో చోటా.. ఇదేం న్యాయం?.. రామా.. కనవేమిరా అని ఆవేదన వ్యక్తం చేస్తోన్న భద్రాచలంలోని ఐదుగ్రామాల విలీన వివాదంపై ప్రత్యేక కథనం..
చేతిలో పవర్ ఉంటే ఏమైనా చేయొచ్చా? ప్రజల అభిప్రాయంతో పని ఉండదా? రాజకీయం అంటే ఇదేనా? జనంతో మాకేం పని మా రాజకీయం మాది అన్నట్టుగానే ప్రవర్తిస్తారా? ఇన్నాళ్లూ వేచిచూశాం. ఓపిక పట్టాం. ఇక ఊరుకునేదేలే. వెనక్కి తగ్గేదేలే. మా సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది. ఇన్నాళ్లూ ఓ లెక్క.. ఇప్పుడో ఓ లెక్క అని అంటున్నారు ఆ ఐదు గ్రామాల ప్రజలు. దివ్య క్షేత్రంగా భాసిల్లే భద్రాద్రి భవితవ్యాన్ని ప్రశ్నార్ధకంగా మార్చారని నినదిస్తున్నారు.
కదం కదం పర్ లడ్నా సీకో.. అన్న నినాదం ఇప్పుడు ఆ ఐదు గ్రామాల ప్రజలకు ఆయుధంగా మారింది. పోరు మొదలైంది.. తమ ఆకాంక్ష, ఆశయం నెరవేరే వరకు ఊరుకునేదే లేదంటున్నారు. కేంద్రం చేసిన అన్యాయంపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. తమ ఆత్మను వేరుచేసేలా ఆత్మాగౌరవంతో ఆటలాడితే సహించేలేదంటున్నారు. తమను మళ్లీ తెలంగాణలో కలిపే వరకు వెనక్కి తగ్గమని తెగేసి చెబుతున్నారు.
విలీనం వందల గ్రామాలనే కాదు.. భద్రాచలం భవితవ్యాన్ని కూడా అంధకారంగా మార్చింది. విభజన చట్టంలో లేని ఆర్డినెన్స్‌ను తెచ్చిన కేంద్రం.. భద్రాచలం ఉనికి కోల్పోయేలా చేసిందన్నది అఖిలపక్షం నేతల ఆరోపణ. భూములు లేని ఆలయంగా మారడమే కాదు.. ఏ అభివృద్దికి నోచుకోకుండా పోతోందని ఆవేదన చెందుతున్నారు. ప్రజల అభీష్టాన్నే కాదు.. భద్రాచలం ప్రతిష్టను నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇస్తున్నారు జనం. రాముడి స్ఫూర్తిగా తీసుకుని రణాన్ని కొనసాగిస్తున్నామని చెబుతున్నారు. అంతవరకు విశ్రమించమని చెబుతున్నారు. తమ ఆకాంక్షను అమలు చేసే వరకు ఉద్యమాన్ని నడిపిస్తూ ఉంటామని శపథం చేస్తున్నారు ఆ ఐదు గ్రామాల ప్రజలు.
Also read:
Chanakya Niti: సంపద శ్రేయస్సు కోసం మనిషి ఈ నాలుగు విషయాలను గుర్తు పెట్టుకోవాలంటున్న చాణక్య..
Karnataka Hijab Row: అంతర్జాతీయ స్థాయికి హిజాబ్ ఇష్యూ.. అగ్రరాజ్యం అమెరికా ఏమన్నదంటే..?
Telangana: వైద్యరంగంలో తెలంగాణ అద్భుతం.. దేశంలోనే మూడోస్థానంలో రాష్ట్రం: మంత్రి హరీష్ రావు