Trains Cancelled: ఏపీ ప్రయాణికులకు అలెర్ట్.. ఆ మార్గంలో నడిచే రైళ్లు పాక్షికంగా రద్దు.. మరికొన్ని..

South Central Railway: రైల్వే ట్రాక్‌ల మరమ్మతుల కారణంగా చెన్నై-గూడూరు మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు.. మరికొన్ని దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రకటించింది.

Trains Cancelled: ఏపీ ప్రయాణికులకు అలెర్ట్.. ఆ మార్గంలో నడిచే రైళ్లు పాక్షికంగా రద్దు.. మరికొన్ని..
Trains
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 13, 2022 | 5:49 AM

South Central Railway: రైల్వే ట్రాక్‌ల మరమ్మతుల కారణంగా చెన్నై-గూడూరు మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు.. మరికొన్ని దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రకటించింది. అంతేకాకుండా పలు రైళ్లను పాక్షికంగా (Trains Cancelled) రద్దు చేసినట్లు వెల్లడించింది. చెన్నై – గూడురు సెక్షన్‌లో ట్రాక్‌ నిర్వహణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నెల్లూరు – సూళ్లూరుపేట, సూళ్లూరుపేట – నెల్లూరు మధ్య నడిచే మెమూ రైళ్లను (06746 – 06745) ఈ నెల 22న పూర్తిగా రద్దు చేశారు. అదేవిధంగా.. విజయవాడ – చెన్నై సెంట్రల్‌ చెన్నై సెంట్రల్‌ – విజయవాడ (12711 – 12712) రైళ్లను ఈ నెల 22న గూడూర్-చెన్నై సెంట్రల్ మధ్య పాక్షికంగా రద్దు చేశారు. హైదరాబాద్‌ – తాంబరం (12760) మధ్య నడిచే రైలును ఈ నెల 26న చెన్నైబీచ్‌–తాంబరం మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

దారి మళ్లించిన రైళ్ల వివరాలు.. 

∙ పుదుచ్చేరి – న్యూఢిల్లీ (22403) ఎక్స్‌ప్రెస్‌ – ఈ నెల 16న చెంగల్‌పట్టు, అరక్కోణం, పెరంబూర్, కొరుక్కుపేట స్టేషన్‌ల మీదుగా దారిమళ్లింపు.

∙ ఇండోర్‌ – కొచువేలి ఎక్స్‌ప్రెస్‌ (22645) – ఈ నెల 21న గూడూరు, రేణిగుంట, మేల్పాక్కం, కాట్పాడి స్టేషన్‌ మీదుగా మళ్లింపు.

∙ ధన్‌బాద్‌ – అలప్పుజ ఎక్స్‌ప్రెస్‌ (13351) – ఈ నెల 21న గూడూరు, రేణిగుంట, మేల్పాక్కం మీదుగా దారిమళ్లింపు.

∙ కాకినాడ – చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌ (17644) – ఈ నెల 26న పెరంబూర్, అరక్కోణం మీదుగా మళ్లింపు.

∙ కాకినాడ – చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌ (17652) – ఈ నెల 26న అరక్కోణం, కాంచీపురం మీదుగా దారి మళ్లింపు.

∙ చెన్నై ఎగ్మోర్‌ – ముంబై సీఎస్‌టీ ఎక్స్‌ప్రెస్‌ (22158) – ఈ నెల 27న తాంబరం, చెంగల్‌పట్టు మీదుగా దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

Also Read:

Assam CM On CM KCR: సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై అసోం సీఎం హిమంత బిస్వా శర్మ కౌంటర్.. ఏమన్నారంటే..?

Bandi Sanjay: ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రధానిపై సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు.. బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.