Telangana: వైద్యరంగంలో తెలంగాణ అద్భుతం.. దేశంలోనే మూడోస్థానంలో రాష్ట్రం: మంత్రి హరీష్ రావు
Telangana: వైద్యరంగంలో తెలంగాణ దూసుకుపోతుందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. పేదలకు వైద్య సేవలందించడంలో దేశంలోనే..

Telangana: వైద్యరంగంలో తెలంగాణ దూసుకుపోతుందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. పేదలకు వైద్య సేవలందించడంలో దేశంలోనే మూడవ స్థానంలో నిలిచిందన్నారు. నెంబర్ 1 స్థానంలో నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు మంత్రి హరీష్ రావు. శనివారం నాడు ఫీవర్ ఆసుపత్రిలో 11 కోట్ల రూపాయలతో నిర్మించిన ఓపీ బ్లాక్‌ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. పేదలకు నాణ్యమైన వైద్యం అందించడంలో తెలంగాణ ముందుందన్నారు. దేశంలో వైద్యరంగాభివృద్ధిలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందన్నారు. నంబర్ వన్ స్థానంలో నిలవడమే లక్ష్యంగా కృషి చేయాలని వైద్యులకు సూచించారు ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు ఆసుపత్రుల అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆసుపత్రులపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధపెట్టారని తెలిపారు మంత్రి.
వైద్యరంగంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో నిలవడం సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనమన్నారు మంత్రి హరీశ్‌రావు. వైద్యసేవల్లో దేశంలోనే తెలంగాణ మూడోస్థానంలో ఉందన్న విషయాన్ని కేంద్రమే స్వయంగా ఒప్పుకున్న సంగతి గుర్తుచేశారాయన. గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రులపై పెరిగిన లోడ్‌ను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అందులో భాగంగానే హైదరాబాద్ నలుదిక్కులా నాలుగు సూపర్ స్పెషాలిటీ అసుపత్రుల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు మంత్రి హరీశ్‌రావు.
Also read:
Women Workers: ఆ కంపెనీల్లో మహిళలకు ఉద్యోగ అవకాశాలు..
Viral Video: ఏంట్రా ఇదీ.. పచ్చి మిర్చి హల్వా అంట.. వామ్మో అంటున్న నెటిజన్లు !! వీడియో