AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women Workers: ఆ కంపెనీల్లో మహిళలకు ఉద్యోగ అవకాశాలు..

Women Workers: దేశంలోని ఐటీ కంపెనీల్లో జెండర్ గ్యాప్ వేగంగా తగ్గుతోంది. టీసీఎస్(TCS), ఇన్ఫోసిస్(Infosys), విప్రో(wipro), టెక్ మహీంద్రా(Tech Mahindra), ఎంఫసిస్(Mphasis), మైండ్ ట్రీ(Mindtree) లాంటి..

Women Workers: ఆ కంపెనీల్లో మహిళలకు ఉద్యోగ అవకాశాలు..
Jobs For Women
Ayyappa Mamidi
|

Updated on: Feb 12, 2022 | 10:17 PM

Share

Women Workers: దేశంలోని ఐటీ కంపెనీల్లో జెండర్ గ్యాప్ వేగంగా తగ్గుతోంది. టీసీఎస్(TCS), ఇన్ఫోసిస్(Infosys), విప్రో(wipro), టెక్ మహీంద్రా(Tech Mahindra), ఎంఫసిస్(Mphasis), మైండ్ ట్రీ(Mindtree) లాంటి దిగ్గజ టెక్నాలజీ సేవల కంపెనీల్లో ప్రతి పది మంది ఉద్యోగుల్లో ముగ్గురు మహిళలు ఉంటున్నట్లు సదరు కంపెనీల హెచ్ ఆర్ లు డిసెంబరు నెలాకరునాటికి ఇచ్చిన వివరాలు చెబుతున్నాయి. చాలా కంపెనీల తమ మెుత్తం ఉద్యోగుల్లో 45 నుంచి 50 శాతం మహిళలు ఉండేలా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం అనేక కార్యక్రమాలను ప్రత్యేకంగా తమ సంస్థల్లో అమలు చేస్తున్నారు.

తాజాగా చేసిన సర్వేల ప్రకారం టాప్ 20 ఐటీ సేవల కంపెనీల్లో మహిళల శాతాన్ని రానున్న 24 నెలల్లో ప్రస్తుతం ఉన్న 30 నుంచి 45 శాతానికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే సగటున ఆ కంపెనీల్లో మహిళల నిష్పత్తి 26 శాతంగా ఉన్నట్లు తేలింది. దీనికి సంబంధించి టెక్ మహీంద్రా గడచిన ఆరు నెలల్లో 5 శాతం మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచింది. ప్రస్తుతం ఈ కంపెనీలో లక్షా 50 వేల మంది మహిళలు ఉండగా.. మెుత్తం ఉద్యోగుల్లో సగం మంది మహిళలే ఉండాలని కంపెనీ నిర్ణయించినట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు. విప్రో తమ క్యాంపస్ ప్లేస్ మెట్లలో 50 శాతం మహిళలనే నియమించుకుంటున్నట్లు తెలిసింది. కేవలం జెండర్ విషయంలోనే కాకుండా ఉద్యోగుల ఎంపికలో వివిధ ప్రాంతాలు, జాతి వారికి సైతం ప్రాముఖ్యతనిస్తున్నట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు.

ఇక టీసీఎస్ 2 లక్షలకుపైగా మహిళలకు తమ సంస్థలో భాగస్వాములుగా చేసుకుని సగటున 34 నుంచి 40 శాతం మహిళలు ఉండేలా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరో దిగ్గజం ఇన్ఫోసిస్ సైతం తమ ఉద్యోగుల్లో 40 శాతం మహిళలు ఉన్నట్లు వెల్లడించింది. ఎంఫసిస్ సంస్థ మెుత్తం ఉద్యోగుల్లో 65 శాతం పురుషులు, 35 శాతం మహిళలు ఉండేలా చూసుకుంటోంది. రానున్న కాలంలో తమ సంస్థలో మహిళల శాతాన్ని మరింతగా పెంచుతామని ఎంఫసిస్ స్పష్టం చేసింది. మైండ్ ట్రీ సంస్థ తమ క్యాంపస్ ప్లేస్ మెంట్లలో 50 శాతం మహిళలను తీసుకుంటున్నట్లు వెల్లడించింది. కంపెనీలోని వివిధ విభాగాల్లో మహిళల శాతం వేరువేరుగా ఉంటుందని తెలిపింది. ఇలా దేశంలోని వివిధ దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగుల్లో మహిళలకు తగినంత ప్రాముఖ్యతను ఇస్తూ ముందుకెళుతున్నాయి.

ఇవీ చదవండి..

Rakesh Jhunjhunwala: ఒక్కరోజే రూ. 426 కోట్లు కోల్పోయిన బిగ్ బుల్.. ఏ కంపెనీల్లో అంటే..

Mukesh Ambani: తగ్గేదే లే.. ఆ రంగంలో ముకేశ్ అంబానీ భారీ పెట్టుబడులు.. పూర్తి వివరాలు..