పొందుగుల చెక్ పోస్ట్ వ‌ద్ద హ‌డావిడి..

లాక్ డౌన్ నిబంధనల సడలింపు నేపధ్యంలో గుంటూరు జిల్లా ఆంధ్ర తెలంగాణ సరిహద్దు పొందుగుల చెక్ పోస్ట్ వద్ద జ‌నం తాకిడి పెరిగింది. అయితే సరైన అనుమతి పత్రాలు లేక ఎండలో నిలిబ‌డి ఉన్న‌ 50 మందిని అధికారులు దాచేపల్లి మార్కెట్ యార్డ్ కు తరలించారు. ఇక మరోవైపు తెలంగాణ నుండి ఆంధ్ర వచ్చే వలస కూలీలను సొంత ప్రాంతాలకు తరలించేందుకు పొందుగుల చెక్ పోస్టు వద్ద 5 ఆర్టీసి బస్సులను అధికారులు సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్ […]

పొందుగుల చెక్ పోస్ట్ వ‌ద్ద హ‌డావిడి..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 01, 2020 | 3:00 PM

లాక్ డౌన్ నిబంధనల సడలింపు నేపధ్యంలో గుంటూరు జిల్లా ఆంధ్ర తెలంగాణ సరిహద్దు పొందుగుల చెక్ పోస్ట్ వద్ద జ‌నం తాకిడి పెరిగింది. అయితే సరైన అనుమతి పత్రాలు లేక ఎండలో నిలిబ‌డి ఉన్న‌ 50 మందిని అధికారులు దాచేపల్లి మార్కెట్ యార్డ్ కు తరలించారు.

ఇక మరోవైపు తెలంగాణ నుండి ఆంధ్ర వచ్చే వలస కూలీలను సొంత ప్రాంతాలకు తరలించేందుకు పొందుగుల చెక్ పోస్టు వద్ద 5 ఆర్టీసి బస్సులను అధికారులు సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ బోర్డర్‌లో లాక్ డౌన్ ప్ర‌క‌టించిన అనంత‌రం అనేక‌సార్లు ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్తిన విష‌యం తెలిసిందే. సొంత ఊర్ల‌కు వెళ్లాల‌నుకునే ఉభ‌య రాష్ట్రాలు ప్ర‌జ‌లు నిబంధ‌న‌లు అతిక్ర‌మించి మ‌రీ పోలీసుల‌ను ముప్పుతిప్ప‌లు పెట్టారు.