Rythu Bharosa Yatra: అనంతపురంలో పవన్ కల్యాణ్ పర్యటన.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ఆర్థిక సాయం
Rythu Bharosa Yatra: జనసేన అధినేత పవర్ కల్యాణ్ ఈ రోజు అనంతపురం జిల్లాలో పర్యటించారు. జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్రలో..
Rythu Bharosa Yatra: జనసేన అధినేత పవర్ కల్యాణ్ ఈ రోజు అనంతపురం జిల్లాలో పర్యటించారు. జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ధర్మవరం నియోజవర్గం గొట్లూరులో మైనార్టీ వర్గానికి చెందిన కౌలు రైతు శ్రీ నిట్టూరు బాబు కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పరామర్శించారు. శ్రీ బాబు వ్యవసాయంలో నష్టాలు రావడంతో అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. బాబు మరణం తరువాత తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబానికి భరోసా కల్పించేందుకు జనసేన పార్టీ తరఫున ఆయన భార్య మల్లికకు రూ. లక్ష ఆర్ధిక సాయాన్ని అందించారు పవన్ కల్యాణ్.
ఈ సందర్భంగా కుమార్తెలు ఇద్దరిని పలకరించిన వారి చదువుల గురించి ఆరా తీశారు. ఆర్ధిక ఇబ్బందులు నేపథ్యంలో వారి చదువులకు ఎటువంటి ఆంటకం ఏర్పడకుండా జనసేన పార్టీ బాధ్యత తీసుకుంటుందని పవన్ హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి: