Viral News: ఆడవారికి మాత్రమే.. పురుషులకు నో ఎంట్రీ.. అసలు విషయం ఏంటంటే..
ఆ గ్రామంలో ఆరోజు ఆడవాళ్లదే..అక్కడ ఆడవాళ్ళకు మాత్రమే ప్రత్యేకం.. మగవాళ్ళ సైతం ఆడవాళ్ళ వైపు కన్నెత్తి చూడరు..
ఆ గ్రామంలో ఆరోజు ఆడవాళ్లదే..అక్కడ ఆడవాళ్ళకు మాత్రమే ప్రత్యేకం.. మగవాళ్ళ సైతం ఆడవాళ్ళ వైపు కన్నెత్తి చూడరు.. పైగా మగవాళ్లెవరు అటు వెళ్లకుండా కాపలా కాస్తారు.. ఎక్కడ ఆ గ్రామం.. ఏమిటా ప్రత్యేకత.. తెలుసుకోవాలంటే ఏలూరు జిల్లా నిడమర్రు మండలం అడవికొలను గ్రామానికి వెళ్లాల్సిందే. పశ్చిమగోదావరి జిల్లాలోనే ఈ విచిత్ర ఆచారం ఉంది. అది కేవలం ఆడవారికి మాత్రమే..ఆ రోజు మగవాళ్లు సైతం ఆడవాళ్ల వైపు కన్నెత్తి చూడరు..ఇక్కడ జాతరలో ప్రత్యేకించి ఒకరోజును మహిళలకు కేటాయిస్తారు. పురుషులు ఎవరూ జాతరలో దుకాణాల వద్దకు వెళ్లకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటుచేస్తారు. ఏంటి విచిత్రం..ఎందుకిలా అనే సందేహం కలుగుతుంది కదా..? అయితే అసలు విషయం తెలుసుకుందామా.
ఏలూరు జిల్లా నిడమర్రు మండలంలోని అడవికొలను గ్రామం.. అడవికొలనులో ఏటా గ్రామదేవత సంగాలమ్మ జాతర పది రోజులపాటు జరుగుతుంది. శ్రీరామనవమి ఉత్సవాలతో పాటు జాతర కూడా ముగుస్తుంది. ఈ తీర్థం ప్రత్యేకించి మహిళల కోసమే నిర్వహిస్తారు. తీర్థంలో మహిళలకు కావలసిన చీరలు, డ్రెస్సులు, గాజులు, బొట్టు బిల్లలు, ఫ్యాన్సీ సామాన్లు, గృహోపకరణాలకు వాడే వస్తువులు, వాటితో పాటు బొమ్మల దుకాణాలు ఏర్పాటు చేస్తారు. ఇక మహిళలు స్వేచ్ఛగా తీర్థంలో షాపింగ్ చేసుకుని వారికి కావాల్సిన వస్తువులు కొనుక్కుంటారు. పురుషులు ఎవరూ వెళ్లకుండా ఉత్సవ కమిటీ సభ్యులు కర్రలతో కాపలా కాస్తారు. ఈ సంప్రదాయం తెలియని ఇతర గ్రామాల వారు జాతరకు వెళ్లకుండా ఈ కాపలాగా ఉంటారు. . ఈవ్ టీజింగ్, కామెంట్స్ లేకుండా స్వేచ్ఛగా షాపింగ్ చేసుకో గలుతున్నామని మహిళలు చెబుతున్నారు. గ్రామస్తుల బంధువులు, ఇతర ప్రాంతాల మహిళలు కూడా జాతరకు తరలివస్తారు. ఇది స్త్రీలకు తామిచ్చే గౌరవంగా ఆ గ్రామస్తులు భావిస్తారు. ఈ సాంప్రదాయం తమ గ్రామం ఏర్పడినప్పటి నుండి కొనసాగుతుందని చెబుతున్నారు.
Also Read: Priyamani: ట్రోల్స్ పై స్పందించిన ప్రియమణి.. కొన్నిసార్లు జీర్ణించుకోలేకపోయేదాన్ని అంటూ..
Dasara Movie: గోదావరిఖనిలో దసరా చిత్రయూనిట్ సందడి.. నాని, కీర్తి సురేష్ మధ్య సాంగ్ షూటింగ్..
Vijay Thalapathy: ఆ కారణంతోనే దూరంగా ఉంటున్నా.. సంచలన విషయాలు బయటపెట్టిన విజయ్..
Naga Chaitanya: హీరో నాగచైతన్య కారుకు జరిమానా విధించిన పోలీసులు.. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద..