Anil Kumar Yadav: ఆయన నాకు ఎంత సహకారం అందించారో.. దానికి డబుల్ సహకారం ఇస్తా.. మంత్రి కాకానిపై అనిల్‌కుమార్ సెటైర్లు..
తగ్గేదేలే. ఇన్నాళ్లు సింగిల్ ఫోర్సే. ఇప్పుడు డబుల్ ఫోర్స్‌తో టీడీపీకి, జనసేనలకు కౌంటర్ ఇస్తామంటున్నారు మాజీ మంత్రి అనిల్‌కుమార్. తనకు లోపల బయటా ఒకే విధంగా మాట్లాడటం నాకు అలవాటని అన్నారు.
తగ్గేదేలే. ఇన్నాళ్లు సింగిల్ ఫోర్సే. ఇప్పుడు డబుల్ ఫోర్స్‌తో టీడీపీకి, జనసేనలకు కౌంటర్ ఇస్తామంటున్నారు మాజీ మంత్రి అనిల్‌కుమార్(Anil Kumar Yadav). తనకు లోపల బయటా ఒకే విధంగా మాట్లాడటం నాకు అలవాటని అన్నారు. కొంత మంది ఎమ్మెల్యేల్లా ఒంగోలు గిత్త సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ తనది కాదన్నారు.. మంత్రివర్గం నుంచి బయటకు వచ్జిన వారిపై కొందరు అనేక వ్యాఖ్యలు చేస్తున్నారని.. రాజు మంచి సైనికులనే యుద్ధంలోకి పంపినట్లు మాపై బాధ్యతలు పెట్టారు సీఎం జగన్మోహన్ రెడ్డి. మేము ఎవరూ తగ్గేదే లేదు.. సీఎం జగన్ చెప్పినట్లు తాను మళ్లీ మంత్రిని అవుతానన్నారు. అయితే.. మంత్రిగా ప్రమాణ స్వీకారానికి కాకాని నుంచి తనకు ఆహ్వానం రాలేదన్నారు. అందుకే హాజరు కాలేదని.. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ని సంబంధిత కార్యకమలకు కచ్చితంగా ఆహ్వానిస్తారని దీమా వ్యక్తం చేశారు.
మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డిపై సెటైర్లు..
వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డిపై సెటైర్లు వేశారు మాజీ మంత్రి అనిల్‌కుమార్. తాను మంత్రిగా ఉన్నప్పుడు గోవర్ధన్‌రెడ్డి ఏ రకంగా సహకారం అందించారో, అంతకు డబుల్ సహకారం తన వైపు నుంచి ఉంటుందని వ్యాఖ్యానించారు. వీరిద్దరి మధ్య కోల్డ్‌వార్ జరుగుతోందనే ప్రచారం నేపథ్యంలో అనిల్‌కుమార్ వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. మరోవైపు ప్రమాణ స్వీకారానికి కాకాని పిలవలేదు కాబట్టే తాను వెళ్లలేదన్నారు అనిల్‌కుమార్.
పవన్ కళ్యాణ్ బీమ్ల నాయక్ కాదు..
151 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తే మెయిన్ హీరో అవుతాడు.. పవన్ కళ్యాణ్ బీమ్ల నాయక్ కాదు.. బిచ్చం నాయక్.. టీడీపీ వేసే బిక్షం కాకుండా సొంతంగా పోటీ చేస్తే బీమాలా నాయక్ అని ఒప్పుకుంటానని మాజీ మంత్రి అనిల్ యాదవ్ కామెంట్ చేశారు.
2019 లో సీఎం జగన్మోహన్ రెడ్డి తొలి క్యాబినెట్ లో అవకాశం ఇచ్చారని.. నెల్లూరు జిల్లా నుంచి బీసీగా నాకు అవకాశం ఇచ్చారని అన్నారు. ఆ రోజే రెండున్నర ఏళ్ల తర్వాత పార్టీ బాధ్యతలు తీసుకోవాలని చెప్పారు. మళ్లీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం.. జగన్ కి సైనికుడిగా పని చేయడంలో ఉండే తృప్తి మాకు పదవుల్లో లేదని అన్నారు. మూడేళ్ళుగా మంత్రి బాధ్యతల కారణంగా నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో ఉండలేకపోయానని.. ఇకపై పూర్తిస్థాయిలో జనంలో ఉండేలా కార్యాచరణ ప్లాన్ చేసుకున్నాను మాజీ మంత్రి అనిల్‌కుమార్.
ఇవి కూడా చదవండి: Hyderabad: సమయం లేదు మిత్రమా.. బంపర్ ఆఫర్ మూడు రోజులే.. ఆ తర్వాత మీకు ఫుల్ బ్యాండే..
Coronovirus: కరోనా నుంచి కోలుకున్నవారిలో సంతానోత్పత్తి ఉండదా?.. స్టన్నింగ్ రిపోర్ట్..