Dasara Movie: గోదావరిఖనిలో దసరా చిత్రయూనిట్ సందడి.. నాని, కీర్తి సురేష్ మధ్య సాంగ్ షూటింగ్..

Dasara Movie: గోదావరిఖనిలో దసరా చిత్రయూనిట్ సందడి.. నాని, కీర్తి సురేష్ మధ్య సాంగ్ షూటింగ్..
Nani

న్యాచురల్ స్టార్ హీరో నాని (Nani).. ఇటీవల శ్యామ్ సింగరాయ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కృతి శెట్టి, సాయి పల్లవి,

Rajitha Chanti

|

Apr 12, 2022 | 8:18 AM

న్యాచురల్ స్టార్ హీరో నాని (Nani).. ఇటీవల శ్యామ్ సింగరాయ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కృతి శెట్టి, సాయి పల్లవి, నాని ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించింది. ఇక ప్రస్తుతం నాని అంటే సుందరానికీ.. దసరా (Dasara) సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే అంటే సుందరానికీ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మూవీపై మరింత క్యూరియాసిటీని పెంచేసాయి. ఇక ఇటీవల విడుదలైన పంచెకట్టు పాటక మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాతోపాటు.. దసరా సినిమాలోనూ నటిస్తున్నాడు నాని. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహిస్తున్నారు. జాతీయ అవార్డు విజేత కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న నాని తొలి పాన్ ఇండియా చిత్రంగా రాబోతుంది.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ తెలంగాణ, పెద్దపల్లి జిల్లా, గోదావరిఖనిలో జరుగుతుంది. చిత్రీకరణలో భాగంగా నాని, కీర్తి సురేష్ పై భారీ స్థాయిలో పాటని షూట్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటునాటు పాటలో సంచలన స్టెప్స్ సృష్టించిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ పాటకు కోరియోగ్రఫీ అందిస్తున్నారు. దాదాపు 500 మంది డ్యాన్సర్లతో ఈ పాటని గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకులని అలరించడమే లక్ష్యంగా మండు వేసవిని సైతం లెక్క చేయకుండా ఈ పాట కోసం చిత్ర యూనిట్ కష్టపడి పనిచేస్తుంది. ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి తన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్ పై ‘దసరా’ను భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నాని ఫుల్ లెంత్ మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలకో కనిపిస్తున్న ఈ చిత్రం గోదావరిఖనిలోని సింగరేణి కోల్ మైన్స్‌ దగ్గర ఉన్న ఒక గ్రామం నేపధ్యంలో జరుగుతుంది. ఇటివలే విడుదలైన ‘దసరా’ గ్లింప్స్ ప్రేక్షకులుని ఆకట్టుకుంది. నాని బీడీ వెలిగించి సింగరేణిలో తన గ్యాంగ్‌తో కలిసి వస్తున్న అగ్రెసివ్ యాటిట్యూడ్‌ కనిపించడం సినిమాతో పాటు నాని పాత్రపై కూడా అంచనాలు పెంచింది. ఈ చిత్రంలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి టాప్ డీవోపీ సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యుసర్ గా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు.

Also Read: Vivek Angihotri: మరో రెండు కథలతో రాబోతున్న ది కశ్మీర్ పైల్స్ డైరెక్టర్.. అభిషేక్ అగర్వాల్ కాంబోలో..

Naga Chaitanya: హీరో నాగచైతన్య కారుకు జరిమానా విధించిన పోలీసులు.. జూబ్లీహిల్స్ చెక్‏పోస్ట్ వద్ద..

Karthikeya 2: కార్తికేయ 2 రిలీజ్ డేట్ ఫిక్స్.. నిఖిల్ సినిమా వచ్చేది ఎప్పుడంటే..

RRR Movie: ఆర్‌ఆర్ఆర్ నుంచి కొత్త అప్‌డేట్.. నాటు నాటు ఫుల్‌ వీడియో సాంగ్‌ విడుదల చేసిన చిత్ర యూనిట్..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu