Priyamani: ట్రోల్స్ పై స్పందించిన ప్రియమణి.. కొన్నిసార్లు జీర్ణించుకోలేకపోయేదాన్ని అంటూ..

సాధారణంగా హీరోయిన్లపై సోషల్ మీడియాలో శ్రుతిమించిన కామెంట్స్ చేస్తుంటారు. వారి డ్రెస్సింగ్ పై .. శరీరాకృతి గురించి ఇష్టానుసారంగా కామెంట్స్ చేస్తుంటారు.

Priyamani: ట్రోల్స్ పై స్పందించిన ప్రియమణి.. కొన్నిసార్లు జీర్ణించుకోలేకపోయేదాన్ని అంటూ..
Priyamani
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 12, 2022 | 9:10 AM

సాధారణంగా హీరోయిన్లపై సోషల్ మీడియాలో శ్రుతిమించిన కామెంట్స్ చేస్తుంటారు. వారి డ్రెస్సింగ్ పై .. శరీరాకృతి గురించి ఇష్టానుసారంగా కామెంట్స్ చేస్తుంటారు. అయితే కొంతమంది హీరోయిన్లు ఎప్పటికప్పుడు తమపై కామెంట్స్ చేసేవారికి స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తుంటారు. మరికొంత మంది మాత్రం చూసి చూడనట్టు వదిలేస్తారు. హీరోయిన్స్ కాస్త బొద్దుగా కనిపించినా వారి శరీరాకృతిపై గురించి నెట్టింట్లో దారుణంగా ట్రోల్స్ చేస్తుంటారు. తాజాగా బాడీ షేమింగ్ పై వచ్చే ట్రోల్స్ పై స్పందించింది హీరోయిన్ ప్రియమణి. శరీరాకృతి ఎలా ఉన్నా దానిని మనం స్వీకరించాలని.. ప్లస్ సైజ్ వ్యక్తిగా ఉన్న మీ శరీరం పట్ల సానుకూలంగా ఉండాలని చెప్పింది ప్రియమణి (Priyamani). ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గోని సోషల్ మీడియాలో వచ్చే బాడీ షేమింగ్ ట్రోలింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో తనపై వచ్చే మీమ్స్ చూసి ఎంజాయ్ చేసేదాన్ని అని.. కానీ కొన్నిసార్లు వచ్చే కామెంట్స్ అస్సలు జీర్ణించుకోలేకపోయేదాన్ని అంటూ చెప్పింది. అలాంటి కామెంట్స్ వస్తే వెంటనే బ్లాక్ చేస్తానని చెప్పింది.

ప్రియమణి మాట్లాడుతూ.. “సోషల్ మీడియా అనేది జీవితం కాదు.. నేను అభిమానులకు ఏం చెప్పాలనుకున్నది మాత్రమే చెప్తాను. వారు వాటిని అంగీకరించి స్వీకరిస్తే పర్వాలేదు.. కానీ కొందరు ట్రోల్స్ చేస్తుంటారు. వారు చెప్పాలనుకున్నది చెప్పే అధికారం ఉంటుంది..కానీ కొందరు మరింత శ్రుతిమించి కామెంట్స్ చేస్తుంటారు. సోషల్ మీడియా అనేది చాలా గమ్మత్తైనది. అందులే మీరు మీ అభిమానులకు మీ గురించి ప్రతి విషయాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు నా గురించి వచ్చే మీమ్స్ చూసి ఎంజాయ్ చేస్తాను. వాటిని షేర్ చేస్తూ నవ్వుకుంటాను. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని కామెంట్స్ అస్సలు జీర్ణించుకోలేకపోయేదాన్ని.. వెంటనే వారికి గట్టి సమాధానం చెప్తాను. లేదంటే వారిని బ్లాక్ చేస్తాను ” అంటూ చెప్పుకొచ్చింది.

” శరీరాకృతిని మార్చుకోవడానికి పెద్ద పెద్ద వ్యాయమాలు చేయమని నేను చెప్పను. కానీ మీరు మీపట్ల సంతోషంగా ఉండడం ముఖ్యం. మీర్ ప్లస్ సైజ్ వ్యక్తి అయినా సరే. వాటిని పట్టించుకోవడం కంటే మీకు అవసరమైన వాటిపై దృష్టి పెట్టండి. మీకు ఇష్టమైన పని చేయడానికి మీరు ఆరోగ్యంగా ఉండేందుకు కొంత సమయం కేటాయించండి. తేలికపాటి వ్యాయమాలు చేయడం ద్వారా శరీరానికి శ్రమ కల్పించండి.. ఇంటి పనులను చేయండి. ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రియమణి.. మైదాన్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్, ఆర్యన్ భౌమిక్, రుద్రనీల్ ఘోష్ కీలకపాత్రలలో నటిస్తున్నారు.

Also Read: Vivek Angihotri: మరో రెండు కథలతో రాబోతున్న ది కశ్మీర్ పైల్స్ డైరెక్టర్.. అభిషేక్ అగర్వాల్ కాంబోలో..

Naga Chaitanya: హీరో నాగచైతన్య కారుకు జరిమానా విధించిన పోలీసులు.. జూబ్లీహిల్స్ చెక్‏పోస్ట్ వద్ద..

Karthikeya 2: కార్తికేయ 2 రిలీజ్ డేట్ ఫిక్స్.. నిఖిల్ సినిమా వచ్చేది ఎప్పుడంటే..

RRR Movie: ఆర్‌ఆర్ఆర్ నుంచి కొత్త అప్‌డేట్.. నాటు నాటు ఫుల్‌ వీడియో సాంగ్‌ విడుదల చేసిన చిత్ర యూనిట్..